క్రీడాభూమి

ఇంత కాలుష్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: దేశ రాజధాని న్యూఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందంటూ వచ్చిన వార్తలను గమనించారో లేక నిజంగానే అసౌకర్యానికి గురయ్యారో తెలియదుగానీ భారత్‌తో జరుగుతున్న చివరి, మూడో టెస్టు మ్యాచ్ రెండు రోజు ఆటకు శ్రీలంక క్రికెటర్లు రెండు పర్యాయాలు ఆటంకం కలిగించారు. మాస్క్‌లతో మైదానంలోకి దిగారు. క్రికెట్ చరిత్రలోనే వాయు కాలుష్యం పేరుతో మొట్టమొదటిసారి ఆటకు అంతరాయం ఏర్పడడానికి కారణమయ్యారు. ఇన్నింగ్స్‌లో 123వ ఓవర్‌ను వేసే బాధ్యతను మీడియం పేసర్ లాహిరు గామగే తీసుకున్నాడు. మూడు బంతులు వేసిన తర్వాత, నాలుగో బంతికి ఉపక్రమిస్తూ, హఠాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. వాయు కాలుష్యం కారణంగా తాను తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్టు చెప్పాడు. లంక కెప్టెన్ దినేష్ చండీమల్ అతనికి మద్దతునిచ్చాడు. ఫీల్డ్ అంపైర్లు జోల్ విల్సన్, నిగెల్ లాంగ్‌తో కొంత సేపు చర్చించారు. లంక ఆటగాళ్ల అభ్యంతరాన్ని థర్డ్ అంపైర్ డేవిడ్ బూన్‌కు ఫీల్డ్ అంపైర్లు తీసుకెళ్లారు. కొంత సేపు మాట్లాడిన తర్వాత, బూన్ సూచనపై ఆటను కొనసాగించాలని చండీమల్ నిర్ణయించాడు. మొత్తం మీద ఈ వ్యవహారం వల్ల మధ్యాహ్నం 12.32 నంచి 12.49 వరకు, 17 నిమిషాల పాటు ఆటకు అంతరాయం ఏర్పడింది. ఏకాగ్రత కోల్పోయిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆతర్వాత కొద్ది సేపటికే ఔటయ్యాడు. మరో నాలుగు ఓవర్ల తర్వాత అదే సమస్య మరోమారు తెరపైకి వచ్చింది. ఆ ఓవర్‌లో ఐదు బంతులు వేసిన సురంగ లక్మల్ వాయు కాలుష్యంతో ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోతున్నానని పేర్కొంటూ మైదానాన్ని విడిచిపెట్టాడు. దీనితో ఆ ఓవర్‌లో మిగిలిన ఒక బంతిని దిల్‌రువాన్ పెరెరా వేశాడు. 128వ ఓవర్‌ను లక్షన్ సండాకన్ మొదలుపెట్టి ఐదు బంతులు వేశాడు. ఆ సమయంలో, మైదానంలో పది మంది ఫీల్డర్లే ఉన్నారంటూ చండీమల్ మరోసారి ఆటకు అంతరాయం కలిగించాడు. అంపైర్‌తో మళ్లీ చర్చకు ఉపక్రమించాడు. పరిస్థితిని గమనించిన కోహ్లీ తీవ్ర అసహనానికి గురయ్యాడు. శ్రీలంక ఆటగాళ్లు రెండోసారి ఆటకు అంతరాయం కలిగించడంతో ఆగ్రహించిన అతను, ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇంతకీ నిజంగానే వాయు కాలుష్యం వల్ల లంక ఆటగాళ్లకు ఇబ్బందులు తలెత్తాయా? లేక భారత బ్యాట్స్‌మెన్ విజృంభణకు అడ్డుకట్ట వేయడానికి వీలుగా, సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని వృథా చేయడమే లక్ష్యంగా ఈ ఎత్తుగడను అనుసరించారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

చిత్రం..మాస్క్‌తో లంక కెప్టెన్ దినేష్ చండీమల్