క్రీడాభూమి

న్యూజిలాండ్ ఓపెన్ బాడ్మింటన్ మెయిన్ డ్రాకు మను, అశ్వనీ అర్హత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత జోడీ మను అత్రి, అశ్వనీ పొన్నప్ప మెయిన్ డ్రాకు అర్హత సాధించారు. క్వాలిఫయర్స్ తొలి రౌండ్ మ్యాచ్ నుంచి ప్రత్యర్థులు క్రిస్ట్ఫోర్ స్టీగ్స్, ఎరెనా కాల్డర్-హాకిన్స్ జోడీ తప్పుకోవడతో బై సాధించిన మను, అశ్వనీ రెండో రౌండ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన నికోల్ టాగ్లే, దెబోరా ఇన్ జోడీని మట్టి కరిపించారు. పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ పోరులో మను, అశ్వనీ 21-10, 21-11 గేముల తేడాతో విజయం సాధించారు. మెయిన్ డ్రా తొలి రౌండ్‌లో వీరు ఆస్ట్రేలియాకు చెందిన రాబిన్ మిడిల్టన్, లియానే్న చూ జోడీతో తలపడనున్నారు. అలాగే ఈ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో బి.సుమీత్ రెడ్డితో కలసి బరిలోకి దిగిన మను అత్రి తొలి రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన షాంగ్ కై లిన్, లూ చింగ్ యావో జోడీతో తలపడనున్నారు. అలాగే పురుషుల డబుల్స్‌లో జరిగే మరో మ్యాచ్‌లో భారత్‌కు చెందిన ప్రణవ్ జెర్రీ చోప్రా, అక్షయ్ దేవాల్కర్ జోడీ న్యూజిలాండ్ క్రీడాకారులు జోషువా కర్రీ, మవోనీ హు హెలతో తలపడతారు.
కాగా, మహిళల డబుల్స్‌లో నాలుగో సీడ్ జోడీగా బరిలోకి దిగిన జ్వాలా గుత్త, అశ్వనీ పొన్నప్పకు తొలి రౌండ్‌లో బై లభించింది. దీంతో రెండో రౌండ్‌లో వీరు జపాన్‌కు చెందిన మయు మత్సుమోటో, వకానా నగహరా జోడీతో గానీ, న్యూజిలాండ్‌కు చెందిన మరియా మసినిపెని, జాస్మిన్ చుంగ్ మన్ జోడీతో గానీ తలపడతారు. అలాగే మిక్స్‌డ్ డబుల్స్‌లో జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత్‌కు చెందిన ప్రణవ్ జెర్రీ చోప్రా, ఎన్.సిక్కీరెడ్డి ఆస్ట్రేలియాకు చెందిన జోనాథన్ సన్, జెన్నిఫర్ టామ్ జోడీతో తలపడనున్నారు.