క్రీడాభూమి

ఇంగ్లాండ్ 227 ఆలౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్, డిసెంబర్ 4: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 227 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా 8 వికెట్లకు 442 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా, మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి మార్క్ స్టోన్‌మన్ (18) వికెట్‌ను కోల్పోయి 29 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజైన సోమవారం ఉదయం ఆటను కొనసాగించి, మరో రెండు పరుగులకే జేమ్స్ విన్స్ (2) వికెట్‌ను కోల్పోయింది. ఆతర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఓపెనర్ అలస్టర్ కుక్ (37), మోయిన్ అలీ (25), క్రిస్ వోక్స్ (36), క్రెగ్ ఓవర్టన్ (41) కొద్దిసేపు ఆస్ట్రేలియా బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించారు. అయితే, వీరితోసహా ఎవరూ క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోవడంతో, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌కు 76.1 ఓవర్లలో 227 పరుగుల వద్ద తెరపడింది.
మొదటి ఇన్నింగ్స్‌లో 215 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ (4), డేవిడ్ వార్నర్ (14), ఉస్మాన్ ఖాజా (20), కెప్టెన్ స్టీవ్ వా (6) వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. పీటర్ హాండ్స్‌కోమ్ 3, నాథన్ లియాన్ 3 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో గొప్పగా ఆడడంతో, ఈ జట్టు ప్రస్తుతానికి 268 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంకా ఆరు వికెట్లు చేతిలో ఉన్నాయి.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: 149 ఓవర్లలో 8 వికెట్లకు 442 డిక్లేర్డ్ (డేవిడ్ వార్నర్ 47, ఉస్మాన్ ఖాజా 53, స్టీవెన్ స్మిత్ 40, పీటర్ హ్యాండ్స్‌కోమ్ 36, షాన్ మార్ష్ 126, టిమ్ పైన్ 57, జేమ్స్ ఆండర్సన్ 1/74, స్టువర్ట్ బ్రాడ్ 2/72, క్రిస్ వోక్స్ 1/84, క్రెగ్ ఓవర్టన్ 3/105).
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్: 76.1 ఓవర్లలో 227 ఆలౌట్ (అలస్టర్ కుక్ 37, క్రిస్ వోక్స్ 36, క్రెగ్ ఓవర్టన్ 41, నాథన్ లియాన్ 4/60, మిచెల్ స్టార్క్ 3/49, పాట్ కమిన్స్ 2/47).
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 26 ఓవర్లలో 4 వికెట్లకు 53 (ఉస్మాన్ ఖాజా 20, పీటర్ హాండ్స్‌కోమ్ 3 బ్యాటింగ్, నాథన్ లియాన్ 3 బ్యాటింగ్, జేమ్స్ ఆండర్సన్ 2/16, క్రిస్ వోక్స్ 2/13).