క్రీడాభూమి

విండీస్‌పై కివీస్ ఇన్నింగ్స్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, డిసెంబర్ 4: వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 45.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. అనంతరం న్యూజిలాండ్ 148.4 ఓవర్లు ఆడి, 9 వికెట్లకు 520 పరుగుల భారీ స్కోరువద్ద డిక్లేర్ చేసింది. కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 105 పరుగులు సాధించగా, మరో సెంచరీ వీరుడు టామ్ బ్లండర్ 107 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో 386 పరుగులు వెనుకబడిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో కడ వరకూ పోరాడింది. కానీ, ఇన్నింగ్స్ పరాజయం నుంచి తప్పించుకోలేకపోయింది. ఆ జట్టు 106 ఓవర్లలో 319 పరుగులకు ఆలౌటైంది. బ్రాత్‌వెయిట్ (91), షిరోన్ హెట్మేయర్ (66) అర్ధ శతకాలతో జట్టును ఆదుకోవడానికి విఫలయత్నం చేశారు. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం కనబరచిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 67 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. కాగా, రెండో టెస్టు హామిల్టన్‌లో ఈనెల 9న మొదలవుతుంది.