క్రీడాభూమి

జర్మనీ చేతిలో భారత్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, డిసెంబర్ 4: హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ టోర్నమెంట్‌లో భారత్ మరో పరాజయాన్ని చవిచూసింది. మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఢీకొని డ్రాగా చేసుకున్న భారత్ ఆతర్వాత ఇంగ్లాండ్ చేతిలో 2-3 తేడాతో ఓడిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన మూడో మ్యాచ్‌లో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జర్మనీతో తలపడి, 0-2 తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన జర్మనీ 17వ నిమిషంలో మార్టిన్ హానెర్ ద్వారా తొలి గోల్‌ను సంపాదించింది. మరో మూడు నిమిషాల్లోనే మాట్స్ గ్రాంబుష్ జర్మనీకి మరో గోల్‌ను అందించాడు. రెండు గోల్స్ తేడాతో ఆధిక్యాన్ని సంపాదించిన వెంటనే జర్మనీ వ్యూహాన్ని మార్చుకుంది. రక్షణాత్మక విధానాన్ని అనుసరించి, గోల్స్ కోసం భారత్ చేసిన ప్రయత్నాలను సమర్థంగా అడ్డుకుంది.
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మ్యాచ్ డ్రా
డిఫెండింగ్ చాంపియన్, విశ్వవిజేత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు చెరి రెండు గోల్స్ చేశాయి. మ్యాచ్ 4వ నిమిషంలోనే లియామ్ అనె్సల్ గోల్ చేయడంతో, ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. అనూహ్యంగా వెనుకబడడంతో కంగుతిన్న ఆస్ట్రేలియా ఎదురుదాడికి దిగి, 33వ నిమిషంలో ఈక్వెలైజర్‌ను సంపాదించింది. డిలాన్ వోత్‌స్పూన్ ఈ గోల్ చేశాడు. మరో ఎనిమిది నిమిషాల్లో బ్లేక్ గోవర్స్ చేసిన గోల్‌తో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యానికి చేరుకుంది. ఈ పరిణామంతో వ్యూహం మార్చుకున్న ఇంగ్లాండ్ దాడులకు ఉపక్రమించి, 54వ నిమిషంలో సఫలమైంది. ఫిల్ రోపర్ ద్వారా ఈక్వెలైజర్ అందడంతో, ఆతర్వాత నింపాదిగా ఆడుతూ, మ్యాచ్‌ని డ్రా చేసుకుంది.