క్రీడాభూమి

బుమ్రాకు చోటు పార్థీవ్‌కు పిలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కగా, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ పార్థీవ్ పటేల్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. వృద్ధిమాన్ సాహాకు స్టాండ్‌బై కీపర్‌గా అతనిని తీసుకున్నారు. 17 మంది సభ్యులతో కూడిన టీమిండియాకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తాడు. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో సోమవారం సమావేశమైన జాతీయ సెలక్షన్ కమిటీ పెద్దగా మార్పులు లేని జట్టునే ప్రకటించింది. శ్రీలంక టూర్ నుంచి విశ్రాంతినిచ్చిన పేసర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికా పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయన్న ఉద్దేశంతో, మహమ్మద్ షమీ, ఇశాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రాతో పటిష్టమైన పేస్ అటాక్‌ను సిద్ధం చేశారు. వారికి మద్దతుగా హార్దిక్ పాండ్యను కూడా తీసుకున్నారు. స్పిన్ విభాగాన్ని నడిపించేందుకు అశ్విన్, రవీంద్ర జడేజా జట్టులో ఉన్నారు.
దక్షిణాఫ్రికా టూర్‌కు భారత టెస్టు జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, లోకేష్ రాహుల్, శిఖర్ ధావన్, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, పార్థీవ్ పటేల్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, ఇశాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా.

జస్‌ప్రీత్ బుమ్రా, పార్థీవ్ పటేల్ (ఫైల్ ఫొటో)