క్రీడాభూమి

వైఫల్యాలు నిజమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, డిసెంబర్ 4: తాను వైఫల్యాలను ఎదుర్కొన్న మాట నిజమేనని, అందుకే జాతీయ జట్టులో చోటు కోల్పోయానని భారత బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ అంగీకరించాడు. యూనిసెఫ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన అతను విలేఖరులతో మాట్లాడుతూ, జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తునే ఉన్నానని చెప్పాడు. 2019 వరకూ తన ప్రయత్నాలు కొనసాగుతాయని 36 ఏళ్ల యువీ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టి 17 సంవత్సరాలు గడిచినా, ఇప్పటికీ తాను కొన్ని సందర్భాల్లో విఫలమవుతునే ఉన్నానని పేర్కొన్నాడు. అయితే, ఈ సమస్యను అధిగమించి, మళ్లీ ఫామ్‌లోకి వస్తానని ధీమా వ్యక్తం చేశాడు. టీమిండియాలో చోటు కోసం తాను పోటీలోనే ఉంటానని తెలిపాడు.