క్రీడాభూమి

విజృంభించిన గుప్టిల్ కివీస్‌కు సెమీస్ బెర్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ: ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో అప్రతిహతంగా దూసుకెళ్తున్న న్యూజిలాండ్ జట్టు హ్యాట్రిక్‌తో మరోమారు సత్తా చాటుకుంది. ఈ టోర్నీలో ఇప్పటికే రెండు విజయాలు సాధించిన ఆ జట్టు మొహాలీలో మంగళవారం పాకిస్తాన్ జట్టును 22 పరుగుల తేడాతో ఓడించి వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాటు సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టులో ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ విజృంభించి ఆడాడు. చూడముచ్చటైన షాట్లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన అతను 33 బంతుల్లో అర్థ శతకాన్ని నమోదు చేసుకోవడంతో పాటు 48 బంతుల్లో మూడు సిక్సర్లు, 10 ఫోర్ల సహాయంతో 80 పరుగులు సాధించి సమీ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. అలాగే మిగిలిన బ్యాట్స్‌మన్లలో కెప్టెన్ కాన్ విలియమ్‌సన్ (17), కొరీ జె.ఆండర్సన్ (21), ల్యూక్ రోంచీ (11) తమవంతు రాణించగా, రాస్ టేలర్ (36), గ్రాంట్ ఇలియట్ (1) అజేయంగా నిలిచారు. దీంతో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ సమీ, కెప్టెన్ అఫ్రిదీ రెండేసి వికెట్లు రాబట్టగా, మొహమ్మద్ ఇర్ఫాన్ ఒక వికెట్ అందుకున్నాడు.
అనంతరం 181 పరుగుల లక్ష్యంతో పాక్ ఇన్నింగ్స్ ప్రారంభించిన షర్జీల్ ఖాన్ (47), అహ్మద్ షెహజాద్ (30) కూడా చక్కగానే రాణించి 65 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే వీరి నిష్క్రమణ అనంతరం ఖలీద్ లతీఫ్ (3) స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేరగా, ఉమర్ అక్మల్ 24 పరుగులు, కెప్టెన్ షహీద్ అఫ్రిదీ 19 పరుగులు సాధించి నిష్క్రమించారు. అనంతరం షోయబ్ మాలిక్ (15), వికెట్ కీపర్ సర్‌ఫ్రాజ్ అహ్మద్ (11) అజేయంగా నిలువడంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే రాబట్టిన పాకిస్తాన్ జట్టు 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకూ మూడు మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. దీంతో సెమీఫైనల్‌కు చేరాలన్న పాక్ ఆశలు అడుగంటాయి. ఈ మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచి న్యూజిలాండ్ విజయంలో కీలకపాత్ర పోషించిన మార్టిన్ గుప్టిల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కైవసం చేసుకున్నాడు.