క్రీడాభూమి

భారత్ విజయావకాశాలపై దనుంజయ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: యువ ఆటగాడు ధనంజయ సిల్వ సెంచరీతో ఆదుకోవడంతో, భారత్‌తో ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన చివరి, మూడో టెస్టును శ్రీలంక డ్రా చేసుకోగలిగింది. భారత బౌలింగ్ విభాగంలో లోపాలను తెరపైకి తెచ్చే విధంగా ధనంజయ, నిరోషన్ డిక్‌విల్లా, రోషన్ సిల్వ అసాధారణ పోరాటం కొనసాగింది. విజయంపై ధీమాతో ఉన్న టీమిండియాకు లంక యువ ఆటగాళ్లు ఓటమి నుంచి జట్టును బయపడేసి, పోరాడితే అసాధ్యమేమీ ఉండదని నిరూపించారు. 410 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి, నాలుగో రోజు, మంగళవారం ఆట ముగిసే సమయానికి 31 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడిన లంక అత్యంత నాటకీయంగా సమస్యను అధిగమించింది. కాగా, నాగపూర్ టెస్టును గెల్చుకోవడం ద్వారా, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1-0 తేడాతో కైవసం చేసుకుంది.
భారత్ తొలి ఇన్నింగ్స్‌ను ఏడు వికెట్లకు 536 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, అందుకు సమాధానంగా లంక మొదటి ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 163 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 62.2 ఓవర్లలో ఐదు వికెట్లకు 246 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. దీనితో లంక ముందు 410 పరుగుల భారీ లక్ష్యం ఉండగా, రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోవడంతో, చివరి రోజైన బుధవారం మిగతా వికెట్లు చేజారకుండా కాపాడుకోవడం అసాధ్యమన్న అభిప్రాయం వ్యక్తమైంది. అప్పటికి ఇంకా విజయానికి 379 పరుగులు చేయాల్సి ఉండగా, ఆ స్కోరును సాధించే మాట ఎలావున్నా, ఆలౌట్ కాకుండా జాగ్రత్త పడితే మ్యాచ్‌ని గెలిచినంత గొప్ప అని విశే్లషకులు వ్యాఖ్యానించారు. అందరూ అనుమానించిన రీతిలోనే, బుధవారం ఆట మొదలైన కొద్దిసేపటికే మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ వికెట్ కూలింది. 20 బంతులు ఎదుర్కొని, ఒక పరుగు చేసిన అతనిని అజింక్య రహానే క్యాచ్ అందుకోగా, రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. 35 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోవడంతో, లంక పరాజయం ఖాయంగా కనిపించింది. అయితే, అందరి అంచనాలకు భిన్నంగా శ్రీలంక పోరాటం కొనసాగింది. నాలుగో వికెట్‌కు 112 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించిన కెప్టెన్ దినేష్ చండీమల్ 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 147 పరుగుల వద్ద ఐదో వికెట్ కూలింది. కండరాల నొప్పితో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన ధనంజయ సిల్వ 219 బంతుల్లో 119 పరుగులు చేశాడు. చివరిలో రోషన్ సిల్వ (74 నాటౌట్), నిరోషన్ డిక్‌విల్లా (44 నాటౌట్) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ, మ్యాచ్‌ని డ్రాగా ముగించారు. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 103 ఓవర్లలో 5 వికెట్లకు 299 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 81 పరుగులిచ్చి మూడు వికెట్లు పగొట్టాడు. మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ చెరొక వికెట్ కూల్చారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి లభించాయి.

స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 127.5 ఓవర్లలో 7 వికెట్లకు 536 డిక్లేర్డ్ (మురళీ విజయ్ 155, విరాట్ కోహ్లీ 243, రోహిత్ శర్మ 65, లాహిరు గామగే 2/95, దిల్‌రువాన్ పెరెరా 1/145, లక్షన్ సండాకన్ 4/167).
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 135.3 ఓవర్లలో 373 ఆలౌట్ (దిల్‌రువాన్ పెరెరా 42, ఏంజెలో మాథ్యూస్ 111, దినేష్ చండీమల్ 164, సదీర సమరవిక్రమ 33, మహమ్మద్ షమీ 2/85, ఇశాంత్ శర్మ 3/98, రవీంద్ర జడేజా 2/86, రవించంద్రన్ అశ్విన్ 3/90.
భారత్ రెండో ఇన్నింగ్స్: 52.2 ఓవర్లలో 5 వికెట్లకు 246 డిక్లేర్డ్ (శిఖర్ ధావన్ 67, చటేశ్వర్ పుజారా 49, విరాట్ కోహ్లీ 50, రోహిత్ శర్మ 50 నాటౌట్, సురంగ లక్మల్ 1/60, లాహిరు గామగే 1/48, దిల్‌రువాన్ పెరెరా 1/54, ధనంజయ డి సిల్వ 1/31, లక్షన్ సండాకన్ 1/50.
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 3 వికెట్లకు 31): దిముత్ కరుణరత్నే సి వృద్ధిమాన్ సాహా బి రవీంద్ర జడేజా 13, సదీర సమరవిక్రమ సి అజింక్య రహానే బి మహమ్మద్ షమీ 5, ధనంజయ డిసిల్వ రిటైర్డ్ హర్ట్ 119, సురంగ లక్మల్ బి రవీంద్ర జడేజా 0, ఏంజెలో మాథ్యూస్ సి అజింక్య రహానే బి రవీంద్ర జడేజా 1, దినేష్ చండీమల్ బి అశ్విన్ 36, రోషన్ సిల్వ 74 నాటౌట్, నిరోషన్ డిక్‌విల్లా 44 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 7, మొత్తం (103 ఓవర్లలో 5 వికెట్లకు) 299.
వికెట్ల పతనం: 1-14, 2-31, 3-31, 4-35, 5-147.
బౌలింగ్: ఇశాంత్ శర్మ 13-2-32-0, మహమ్మద్ షమీ 15-6-50-1, రవిచంద్రన్ అశ్విన్ 35-3-126-1, రవీంద్ర జడేజా 38-13-81-3, మురళీ విజయ్ 1-0-3-0, విరాట్ కోహ్లీ 1-0-1-0.