క్రీడాభూమి

వైట్‌వాష్ తప్పదేమో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, డిసెంబర్ 8: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ పరిస్థితి దారుణంగా ఉందని మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ స్పష్టం చేశాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 0-2 తేడాతో వెనుకబడిన ఇంగ్లాండ్‌కు వైట్‌వాష్ తప్పదేమోనని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుమానం వ్యక్తం చేశాడు. రెండో టెస్టులో గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ, వాటిని తమ జట్టు వినియోగించుకోలేకపోయిందని అన్నాడు. 120 పరుగుల తేడాతో ఆ టెస్టును కోల్పోవడం ఇంగ్లాండ్ ఎదుర్కొంటున్న సమస్యలకు అద్దం పడుతుందని వ్యాఖ్యానించాడు. పెర్త్‌లో జరిగే మూడో టెస్టులో ఎదురుదాడికి దిగాలని సూచించాడు. ఈ ప్రయత్నంలో ఇంగ్లాండ్ సఫలవవుతుందన్న నమ్మకం తనకు ఉందన్నాడు. కాగా, 1978 నుంచి పెర్త్‌లోని వాకా స్టేడియంలో ఆస్ట్రేలియా ఒక్క పరాజయాన్ని కూడా చవిచూడలేదు. అలాంటి పిచ్‌పై ఇంగ్లాండ్ రాణించడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. పెర్త్ టెస్టును గెల్చుకోవడం అసాధ్యంగానే కనిపిస్తున్నదని మరో మాజీ కెప్టెన్ బాబ్ విల్లీ అన్నాడు. ఆత్మవిశ్వాసంతో ఎదురుదాడికి దిగితేనే విజయాలు సాధ్యమని ఇంగ్లాండ్ క్రికెటర్లకు హితవు పలికాడు. ఇలావుంటే, కెప్టెన్ జో రూట్, కోచ్ ట్రెవర్ బేలిస్ మాత్రం తమ విజయావకాశాలకు ఢోకా లేదని స్పష్టం చేస్తున్నారు. రెండో టెస్టులో గట్టిపోటీనిచ్చామని, విజయానికి చేరువలోకి వచ్చినప్పటికీ, దురదృష్టవశాత్తు చేజార్చుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, మిగతా మూడు టెస్టుల్లో విజయాలు సాధించే సత్తా తనకు ఉందన్నారు.

చిత్రం..మైఖేల్ వాన్