క్రీడాభూమి

అర్జెంటీనా సాకర్ లెజెండ్ డిగో మారడోనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడు రోజుల భారత పర్యటన కోసం ఆదివారం రాత్రి కోల్‌కతా విమానాశ్రయానికి చేరిన అర్జెంటీనా సాకర్ లెజెండ్ డిగో మారడోనా. తన భాగస్వామి రిసియో ఒలివాతో కలిసి కోల్‌కతా వచ్చిన అతను మంగళవారం బరాసత్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో ఒక చారిటీ మ్యాచ్ ఆడతాడు. వాస్తవానికి అతను అక్టోబర్ నెలలోనే భారత్‌కు రావాల్సిఉంది. కానీ, వివిధ కారణాలతో ప్రయాణం వాయిదా పడింది. నేవీ బ్లూ టీ షర్టు వేసుకొని, ఆర్మీ టోపీ పెట్టుకొని ఉత్సాహంగా కనిపించిన మారడోనా విమానాశ్రయంలో తన అభిమానులకు అభివాదం చేశాడు. అయితే, అక్కడే వేచి చూస్తున్న విలేఖరులతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా తాను బస చేయాల్సిన హోటల్‌కు వెళ్లిపోయాడు