క్రీడాభూమి

ఎఫ్‌టీపీపై నిర్ణయం నేడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన ఫ్యూచర్స్ టూర్ ప్రోగ్రాం (ఎఫ్‌టీపీ) తీరుపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) సోమవారం జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో ఒక నిర్ణయానికి రావచ్చని తెలుస్తున్నది. ఎఫ్‌టీపీలో విరామం లేకుండా టోర్నీలు, సిరీస్‌లు ఆడాల్సి రావడంతో అలసిపోతున్నామని, నిస్సత్తువ ఆవహిస్తున్నదని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తనకు విశ్రాంతి అవసరమని అతను పట్టుబట్టాడు. ఫలితంగా శ్రీలంకతో వనే్డ, టి-20 సిరీస్‌ల నుంచి సెలక్టర్లు అతనికి విశ్రాంతినిచ్చారు. కాగా, ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సింగపూర్‌లో సమావేశమై, ఎఫ్‌టీపీలను ఖాయం చేసుకునే బాధ్యతను ఆయా క్రికెట్ సంఘాలకు అప్పచెప్పింది. అవిశ్రాంతంగా మ్యాచ్‌లు ఆడలేమని కోహ్లీ తదితరులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో, 2019-21 మధ్య కాలానికి సిరీస్‌లను ఖరారు చేయడంపై బీసీసీఐ చర్చిస్తుంది. ఏడాదిలో క్రికెట్ ఆడే రోజులు ఎన్ని ఉండాలి? అనే ప్రశ్నపై సభ్యులు ఎస్‌జీఎంలో తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. ఆతర్వాత ఒక నిర్ణయం తీసుకొని, తీర్మానాన్ని ఆమోదించే అవకాశాలున్నాయి. ఇలావుంటే, ఎఫ్‌టీపీలో క్రికెట్ ఆడే రోజులను తగ్గించాలన్న డిమాండ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంత మంది ఈ వాదనను సమర్థిస్తుండగా, మరికొంత మంది వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపు జీతం పెంచాలని డిమాండ్ చేస్తున్న ఆటగాళ్లు మరోవైపు మ్యాచ్‌ల సంఖ్యను కుదించాలని కోరడంలో అర్థం లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని బీసీసీఐ అధికారి ఒకరు పీటిఐతో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. ‘గొంతు మీద కత్తిపెట్టి, మ్యాచ్‌లు ఆడాలని బీసీసీఐ ఎవరినీ నిర్బంధించడం లేదు. విశ్రాంతి కోరుకుంటున్న వారు నిరభ్యరంతరంగా తీసుకోవచ్చు. ఎఫ్‌టీపీని శాసించే అధికారం వారికి లేదు. భారత క్రికెట్ ఆటగాళ్ల ఇష్టాయిష్టాలను బట్టి నడవదు’ అన్నాడు. మ్యాచ్‌లను కుదిస్తే, బీసీసీకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని నిలదీశాడు.
కొచ్చి టస్కర్స్ కేరళకు చెల్లించాల్సిన 850 కోట్ల రూపాయల పరిహారం అంశం కూడా ఎస్‌జీఎంలో చర్చకు రానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఒకప్పుడు ఫ్రాంచైజీగా ఉన్న టస్కర్స్‌పై వేటు వేసిన బీసీసీఐ ఇప్పుడు భారీ మొత్తాన్ని చెల్లించుకోవాల్సి వస్తున్నది. ఏదో ఒక విధంగా ఆ ఫ్రాంచైజీతో ఒక అవగాహనకు వచ్చి, కేసును ముగించాలని బీసీసీఐలోని ఒక వర్గం భావిస్తున్నది. అయితే, ఇంత భారీ మొత్తాన్ని చెల్లించే కంటే, మరోసారి కోర్టునుశ్రయించాలని మరో వర్గం వాదన. మొత్తం మీద ఈ అంశంపై వాడివేడి చర్చ తప్పకపోవచ్చు.
రాజస్థాన్ క్రికెట్ సంఘం (ఆర్‌సీఏ)పై గతంలో విధించిన సస్పెన్షన్‌ను ఎత్తి వేసే అంశం కూడా ఎస్‌జీఎంలో కీలకంగా మారనుంది. ఒకప్పుడు ఐపీఎల్‌కు గవర్నర్‌గా సేవలందించి, ఆతర్వాత నిషేధానికి గురైన లలిత్ మోదీ తాను క్రికెట్ వ్యవహారాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఆర్‌సీఏపై నిషేధాన్ని ఎత్తి వేయాలని కొంత మంది వాదిస్తున్నారు. అయితే, సస్పెన్షన్‌ను ఎత్తివేసిన మరుక్షణమే లలిత్ మోదీ మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరిస్తే ఏం చేయాలన్న ప్రశ్న తలెత్తుతుంది. అప్పుడు మరోసారి నిషేధం విధిస్తే, ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉంటుందోనన్న విషయాన్ని కూడా సభ్యులు కూలంకషంగా చర్చిస్తారని సమాచారం. మొత్తం మీద వివిధ ముఖ్యమైన అంశాలపై ఒక అవగాహనకు రావడానికి వీలుగా జరగనున్న ఎస్‌జీఎంలో తీసుకోబోయే నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది. ఎలాంటి నిర్ణయాలు లేకుండానే సమావేశాన్ని ముగించే అవకాశం కూడా లేకపోలేదు.