క్రీడాభూమి

ఆసీస్‌కే హాకీ వరల్డ్ లీగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, డిసెంబర్ 10: ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాకే హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ టోర్నమెంట్ టైటిల్ దక్కింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగినీ జట్టు తుది పోరులో అర్జెంటీనాను 2-1 గోల్స్ తేడాతో ఓడించింది. ఎత్తులు, పైఎత్తులతో సాగిన ఈ మ్యాచ్ కొంత సేపు ఉత్కంఠ రేపినప్పటికీ, పెనాల్టీ షూటౌట్ వరకూ ఆటను కొనసాగించడమే రెండు జట్లు లక్ష్యంగా ఎంచుకోవడంతో, ఎక్కువ సమయం నింపాదిగా సాగింది. మ్యాచ్ మొదట్లో రెండు జట్లు దూకుడుగా వ్యవహరించాయి. ఆరంభంలోనే గోల్స్ సంపాదించి, ఆతర్వాత డిఫెన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆట కొనసాగిది. దీనితో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపించింది. 17వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకున్న జెరెమీ హేవార్డ్ ఆస్ట్రేలియాను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. అయితే, ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. నిమిషం వ్యవధిలోనే అర్జెంటీనాకు ఆస్టిన్ బగాలో ద్వారా ఈక్వెలైజర్ లభించింది. చక్కటి ఫీల్డ్ గోల్‌తో ఆస్టిన్ అలరించాడు. స్కోర్లు సమమైన తర్వాత, రెండు జట్లూ రిస్క్ తీసుకోకూడదని నిర్ణయించుకున్న రీతిలో జాగ్రత్తగా ఆడడం మొదలుపెట్టాయి. ఫలితంగా చాలాసేపు ఆట నిస్తేజంగా కొనసాగింది. ద్వితీయార్ధంలో పరిస్థితి కొంత మెరుగైనప్పటికీ, గోల్స్ మాత్రం నమోదు కాలేదు. మ్యాచ్ చివరి క్షణాలకు చేరుతున్నప్పటికీ, ఇరు జట్లు చెరొక గోల్‌తో సమవుజ్జీగాలుగా ఉన్నందున, పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితాన్ని నిర్ణయించాల్సి వస్తుందన్న అభిప్రాయం బలపడింది. అయితే, 58వ నిమిషంలో బ్లేక్ గోవర్స్ గోల్ సాధించి, ఆస్ట్రేలియాకు 2-1 ఆధిక్యాన్ని అందించాడు. ఆతర్వాత అర్జెంటీనా ఈక్వెలైజర్ కోసం చేసిన ప్రయత్నాలను అడ్డుకున్న ఆస్ట్రేలియా అదే తేడాతో విజయం సాధించి, టైటిల్ నిలబెట్టుకుంది.

చిత్రం..హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్ టోర్నమెంట్ టైటిల్ పోరులో అర్జెంటీనాను ఓడించిన ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఆనందం