క్రీడాభూమి

అంతర్జాతీయ పతకాల విజేతలను సీజీహెచ్‌ఎస్‌లో చేర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన వారికి కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్)ను వర్తింప చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో భారత క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ తెండూల్కర్ విజ్ఞప్తి చేశాడు. చాలా మంది క్రీడాకారులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ, సరైన చికిత్స చేయించుకోలేకపోతున్నారని సచిన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఒలింపిక్ హాకీ స్వర్ణ పతక విజేత మహమ్మద్ షాహిద్ చివరి రోజుల్లో పడిన కష్టాలను సచిన్ తన లేఖలో ప్రస్తావించాడు. అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించి, దేశ కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింప చేసిన వారంతా, సీజీహెచ్‌ఎస్ ద్వారా తమకు కూడా వైద్య సేవలు అందాలని కోరుకుంటుంటున్నారని సచిన్ తెలిపాడు. ఈ అంశాన్న కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకెళ్లినట్టు సచిన్ తన లేఖలో పేర్కొన్నాడు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన ప్రతిపాదనకు మద్దతునిచ్చిందని, అయితే, ఈ అంశం తమ పరిధిలోకి రాదని వివరణ ఇచ్చిందని చెప్పాడు. క్రీడాకారులకు సీజీహెచ్‌ఎస్ సేవలను అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించిన వారిని చేర్చడం ద్వారా ప్రయోగాత్మకంగా అమలు చేయవచ్చని సూచించాడు. ప్రపంచ వేదికలపై వివిధ టోర్నీల్లో పాల్గొన్న లేదా పతకాలు సంపాదించిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం లభించిందని అనుకోవడానికి వీల్లేదని సచిన్ తెలిపాడు. అందుకే, ప్రభుత్వ ఉద్యోగంలో లేని క్రీడాకారులకు ఈ సౌకర్యాన్ని అందించాలని కోరాడు. ప్రధాని సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.