క్రీడాభూమి

గృహ నిర్బంధంలో మెస్సీ సోదరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యూనస్ ఎయిర్స్, డిసెంబర్ 12: అనుమతి లేకుండా ఆయుధాలు కలిగి ఉన్నాడన్న కారణంగా అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ సోదరుడు మథియాస్ మెస్సీని గృహ నిర్బంధంలో ఉంచారు. బ్యూనస్ ఎయిర్స్‌కు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న రొసారియోలో మెస్సీ అన్న మథియాస్ ఉంటున్నాడు. ఇటీవల జరిపిన సోదాలో మథియాస్ వద్ద లెసెన్సులేని ఆయుధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసును విచారణకు తీసుకున్న సైబర్ క్రైమ్ అధికారులు మథియాస్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ అతను ఇంటిని విడిచి బయటకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. అతని తండ్రి జార్జి మెస్సీ నుంచి జామీను కూడా తీసుకున్నారు. ఒకవేళ మథియాస్ ఎటైనా పారిపోతే, అందుకు జార్జి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

సోదరుడు మథియాస్ (కుడి)తో అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీ (ఫైల్ ఫొటో)