క్రీడాభూమి

బాత్రా ఎన్నిక లాంఛనమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: రామచంద్రన్ స్థానంలో భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడిగా నరీందర్ బాత్రా ఎన్నిక లాంఛనమే కానుంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) అధ్యక్షుడిగా ఉన్న బాత్రా నాలుగేళ్ల పదవీ కాలానికి ఐఓఏ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడు. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) అధ్యక్షుడు అనిల్ ఖన్నా తొలుత ఈ పదవికి నామినేషన్ వేసినప్పటికీ, తాను పోటీలో ఉండబోవడం లేదని ప్రకటించాడు. అయితే, అప్పటికే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో, గురువారం నాటి సర్వసభ్య సమావేశంలో ఎన్నికలు జరిగే సమయంలో అతని పేరు కూడా పోటీదారుగా ఉంటుంది. కానీ, వైదొలగుతున్నట్టు అతనే స్వయంగా ప్రకటించడంతో, అధ్యక్షుడిగా బాత్రా ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటిస్తారు. కాగా, ప్రధాన కార్యదర్శిగా రాజీవ్ మెహతా కూడా ఏకగ్రీవంగా ఎన్నికకానున్నాడు.