క్రీడాభూమి

యాషెస్ సిరీస్‌పై ఫిక్సింగ్ నీడలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, డిసెంబర్ 14: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌పై ఫిక్సింగ్ నీడలు అలముకుంటున్నాయి. గురువారం నుంచి మొదలైన మూడో టెస్టు మ్యాచ్‌లో కొన్ని ఓవర్లు, ఆటలోని కొంత భాగాన్ని ఒక బుకీ ఫిక్స్ చేశాడని ఇంగ్లాండ్‌కు చెందిన ‘ది సన్’ పత్రిక ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. దీనికి సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ వివరాలను కూడా బహిర్గతం చేసింది. భారీగా బెట్టింగ్స్‌ను ఆహ్వానించిన సదరు బుకీ, అంతకు ముందే కొంత మంది క్రికెటర్లు, అధికారులతో చర్చించి, తనకు సహకరించేలా వారిని ఒప్పించాడని ‘ది సన్’ వివరించింది. ఈ ఫిక్సింగ్ విలువ సుమారు 1,50,000 డాలర్ల వరకు ఉండవచ్చని పేర్కొంది. యాషెస్ సిరీస్‌లో టెస్టులతోపాటు, ఆస్ట్రేలియా దేశవాళీ టి-20 టోర్నమెంట్ బిగ్ బాష్‌లోనూ నాలుగైదు మ్యాచ్‌లు ఫిక్సింగ్‌కు గురయ్యాయని ఈ పత్రిక ఆరోపించింది. కాగా, బెట్టింగ్, ఫిక్సింగ్ వంటి సంఘటలను తీవ్రంగా పరిగణిస్తామని, అందుకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్పష్టం చేసింది. తమకు తెలిసినంత వరకూ యాషెస్ సిరీస్‌లో ఫిక్సింగ్‌కు ఆస్కారమే లేదని, అన్ని రకాలుగా పకడ్బంది చర్చలు తీసుకున్నామని ప్రకటించింది. ఇంగ్లాండ్ మీడియాలో వచ్చిన ఫిక్సింగ్ వార్తలపై స్పందించేందుకు ఏమీ లేదని, విచారణ జరిపిస్తామని, ఆతర్వాత వచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని సీఏ తెలిపింది.
సాక్ష్యాలు లేవు: ఐసీసీ
దుబాయ్: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో, గురువారం మొదలైన మూడో టెస్టులో కొంత భాగం ఫిక్సింగ్‌కు గురైందని పేర్కొంటూ ‘ది సన్’ పత్రిక చేసిన ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు ఏవీ లేవని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పష్టం చేసింది. ఆ పత్రిక సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించామని, మ్యాచ్‌ని ఫిక్స్ చేసినట్టు స్పష్టం చేసే సమాచారమేదీ అందులో లేదని ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీయు) జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపాడు. ‘ది సన్’ అందించిన వివరాలను తాను స్వయంగా పరిశీలించానని, ఫిక్సింగ్ జరిగిందని అనుమానించాల్సిన అంశాలేవీ తనకు కనిపించలేదని పేర్కొన్నాడు. అయితే, ఈ ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని చెప్పాడు. అందులో నిజానిజాలు తెలుస్తాయని అన్నాడు.