క్రీడాభూమి

డేవిడ్ సిల్వ డబుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, డిసెంబర్ 14: ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో నాగంగా జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో స్వాన్‌సీ సిటీపై డేవిడ్ సిల్వ రెండు గోల్స్ చేసి, మాంచెస్టర్ సిటీ విజయంలో కీలక భూమిక పోషించాడు. అతను 27, 57 నిమిషాల్లో గోల్స్ సాధించగా, కొవి డి బ్రూన్జ్ 34, సెర్గియో ఏంజెరో 85 నిమిషాల్లో గోల్స్ చేశారు. మాంచెస్టర్ సిటీ మొత్తం నాలుగు గోల్స్ సాధించగా, స్వాన్‌సీ సిటీ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. కాగా, ఉత్కంఠ భరితంగా జరిగిన రెండు మ్యాచ్‌ల్లో జొన్జో షెల్వే, రొమెలూ లుకాకూ తమతమ జట్లను విజయపథంలో నడిపారు. న్యూకాజిల్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌ని ఎవర్టన్ 1-0 తేడాతో గెల్చుకుంది. మ్యాచ్ చివరి క్షణాల్లో షెల్వే ఈ కీలక గోల్ చేశాడు. మరో మ్యాచ్‌లో ఏఎఫ్‌సీ బోర్న్‌వౌత్‌ను మాంచెస్టర్ యునైటెడ్ కూడా 1-0 తేడాతోనే ఓడించింది. లుకాకూ చేసిన గోల్ ఈ జట్టును విజపథంలో నడిపించింది. ఇలావుంటే, ఇతర మ్యాచ్‌ల్లో, సౌతాంప్టన్‌ను లీసెస్టర్ సిటీ 4-1, బ్రింగ్‌డన్ హోవ్ అల్బియన్‌ను టోటెన్‌హామ్ హాట్స్‌పర్ 2-0 తేడాతో ఓడించాయి. వెస్ట్ హామ్ యునైటెడ్/ఆర్సెనెల్, లివర్‌పూల్/ వెస్ట్ బ్రోమ్‌విచ్ అల్బియన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.