క్రీడాభూమి

ఐఓఏ అధ్యక్షుడిగా బాత్రా ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడిగా నరీందర్ బాత్రా ఎన్నికయ్యాడు. ఇక్కడ జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో అతని ఎన్నిక లాంఛన ప్రాయంగానే మారింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (హెచ్‌ఐఎఫ్) అధ్యక్షుడిగా కూడా ఉన్న బాత్రాతో అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) అధ్యక్షుడు అనీల్ ఖన్నా పోటీపడ్డాడు. అయితే, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అతను తాను పోటీలో లేనని ప్రకటించాడు. కానీ, సాంకేతికంగా బాత్రాను ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు వెల్లడించడానికి వీల్లేకపోవడంతో, ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. 60 ఏళ్ల బాత్రాకు 142 ఓట్లు లభించగా, పోటీ నుంచి వైదొలగిన ఖన్నాకు 13 ఓట్లు వచ్చాయి.

చిత్రం..నరీందర్ బాత్రా