క్రీడాభూమి

హోరాహోరీలో భారత్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: సులభంగా గెలవాల్సిన మ్యాచ్‌ని పసలేని బౌలింగ్, పట్టులేని ఫీల్డింగ్ కారణంగా సంక్లిష్టం చేసుకున్న టీమిండియా హార్దిక్ పాండ్య వేసిన చివరి ఓవర్‌లో బంగ్లాదేశ్ చివరి మూడు బంతుల్లో మూడు వికెట్లు కోల్పోవడంతో గెలిచి, సెమీస్ అవకాశాలను మెరుగుపరచుకుంది. 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు చివరి వరకూ పోరాడిన బంగ్లాదేశ్, ఒకానొక దశలో విజయభేరి మోగించడం ఖాయంగా కనిపించింది. అయితే, చివరిలో తడబడిన కారణంగా కేవలం ఒక పరుగు తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది.
టాస్ ఓడి.. బ్యాటింగ్‌కు దిగి..
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ చక్కటి ఆరంభాన్నిచ్చే ప్రయత్నం చేశారు. అయితే, 42 పరగుల స్కోరువద్ద ముస్త్ఫాజుర్ రహ్మాన్ వేసిన బంతిని రోహిత్ అర్థం చేసుకోలేక సబ్బీర్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతను 16 బంతుల్లో, ఒక సిక్స్, ఒక ఫోర్‌తో 18 పరుగులు చేశాడు. మరో మూడు పరుగులకే ధావన్ కూడా పెవిలియన్ చేరాడు. 22 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో 23 పరుగులు సాధించిన అతను షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో ఎల్‌బి అయ్యాడు. స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ 24 పరుగులు చేసి షువగత హొమ్ బంతికి క్లీన్ బౌల్డ్ కావడం అభిమానులను నిరాశ పరచింది. టి-20 స్పెషలిస్టుగా ముద్ర వేయించుకున్న సురేష్ రైనా 23 బంతుల్లో 30 పరుగులు చేసి, అల్ అమీన్ హొస్సేన్ బౌలింగ్‌లో సబ్బీర్ రహ్మాన్ దొరికిపోయాడు. 7 బంతుల్లో 15 పరుగులు సాధించిన హార్దిక్ పాండ్యను సౌమ్య సర్కార్ క్యాచ్ అందుకోగా అల్ అమీన్ హొస్సేన్ అవుట్ చేశాడు. చివరిలో యువరాజ్ సింగ్ (3), రవీంద్ర జడేజా (12) వెంటవెంటనే అవుట్‌కాగా, భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసే సమయానికి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 13, రవిచంద్రన్ అశ్విన? 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్త్ఫాజుకర్ రహ్మాన్ 34 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చాడు. అల్ అమీన్ హొస్సేన్ 27 పరుగులకు రెండు వికెట్లు సాధించాడు.
భయపెట్టిన బంగ్లాదేశ్
ఈ మ్యాచ్‌ని గెల్చుకొని రేస్‌లో నిలబడే చివరి అవకాశాన్ని దక్కించుకోవాలన్న బంగ్లాదేశ్ దాదాపు చివరి వరకూ టీమిండియాను భయపెట్టింది. 11 పరుగుల స్కోరువద్ద ఈ జట్టు తొలి వికెట్‌ను మహమ్మద్ మిథున్ రూపంలో కోల్పోయింది. అతను ఒక పరుగు చేసి అశ్విన్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. అయితే, తమీమ్ ఇక్బాల్, సబ్బీర్ రహ్మాన్ వేగంగా పరుగులు సాధించే క్రమంలో భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఒక ఓవర్‌లో తమీమ్ ఇక్బాల్ నాలుగు ఫోర్లు బాది, రన్‌రేట్‌ను పెంచాడు. ప్రమాదకరంగా మారిన ఈ భాగస్వామ్యాన్ని రవీంద్ర జడేజా ఛేదించాడు. 32 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లతో 35 పరుగులు చేసిన తమీమ్ ఇక్బాల్ క్రీజ్ నుంచి ముందుకు వచ్చి జడేజా బంతిని కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, బంతి బ్యాట్‌కు కనెక్ట్ కాలేదు. వికెట్‌కీపర్ ధోనీ క్షణాల్లో బంతిని పట్టుకొని స్టంప్ చేయడంతో 55 పరుగుల వద్ద బంగ్లాదేశ్ రెండో వికెట్ కూలింది. సబ్బీర్ రహ్మాన్ 15 బంతుల్లో 26 పరుగులు చేసి సురేష్ రైనా బౌలింగ్‌లో ధోనీ స్టంప్ చేయగా అవుట్ కావడంతో బంగ్లాదేశ్‌కు కష్టాలు మొదలయ్యాయి. కెప్టెన్ మష్రాఫ్ మొర్తాజాను ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. 87 పరుగుల వద్ద బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కూలింది. జట్టును ఆదుకునే బాధ్యతను సమర్థంగా పోషిస్తున్న షకీబ్ అల్ హసన్ 22 పరుగులు సాధించి, సురేష్ రైనా క్యాచ్ పట్టుకోగా, అశ్విన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆరో వికెట్‌కు మహమ్మదుల్లాతో కలిసి 31 పరుగులు జోడించిన సౌమ్య సర్కార్ 21 పరుగులు చేసి విరాట్ కోహ్లీ క్యాచ్ అందుకోగా ఆశిష్ నెహ్రా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మహమ్మదుల్లా, ముష్ఫికర్ రహీం కాంబినేషన్‌లో బంగ్లాదేశ్ లక్ష్యం దిశగా సాగింది. చివరి ఓవర్‌లో 11 పరుగులు అవసరంకాగా, స్టేడియంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హార్దిక్ పాండ్య వేసిన ఆ ఓవర్ మొదటి బంతికి మహమ్మదుల్లా సింగిల్ తీశాడు. రెండు, మూడు బంతుల్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన ముష్ఫికర్ రహీం (11) నాలుగో బంతిలో శిఖర్ ధావన్ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. తర్వాతి బంతికే రవీంద్ర జడేజా చక్కటి క్యాచ్ పట్టడంత మహమ్మదుల్లా (18) కూడా పెవిలియన్ చేరాడు. చివరి బంతిలో ముస్త్ఫాజుకర్ రహ్మాన్ (0) రనౌట్ కావడంతో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 145 పరుగులు చేయగలిగింది. భారత్ ఒక పరుగు తేడాతో గెలిచింది.

స్కోరుబోర్డు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ సి సబ్బీర్ రహ్మాన్ బి ముస్త్ఫాజుర్ రహ్మాన్ 18, శిఖర్ ధావన్ ఎల్‌బి షకీబ్ అల్ హసన్ 23, విరాట్ కోహ్లీ బి షువగత హొమ్ 24, సురేష్ రైనా సి సబ్బీర్ రహ్మాన్ బి అల్ అమీన్ హొస్సేన్ 30, హార్దిక్ పాండ్య సి సౌమ్య సర్కార్ బి అల్ అమీన్ హొస్సేన్ 15, మహేంద్ర సింగ్ ధోనీ 13 నాటౌట్, యువరాజ్ సింగ్ సి అల్ అమీన్ హొస్సేన్ బి మహమ్మదుల్లా 3, రవీంద్ర జడేజా బి ముస్త్ఫాజుర్ రహ్మాన్ 12, రవిచంద్రన్ అశ్విన్ 5 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 3, మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 146.
వికెట్ల పతనం: 1-42, 2-45, 3-95, 4-113, 5-112, 6-117, 7-137.
బౌలింగ్: మష్రాఫ్ మొర్తాజా 4-0-22-0, షువగత హొమ్ 3-0-24-1, అల్ అమీన్ హొస్సేన్ 4-0-37-2, ముస్త్ఫాజుర్ రహ్మాన్ 4-0-34-2, షకీబ్ అల్ హసన్ 4-0-23-1, మహమ్మదుల్లా 1-0-4-01.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: మహమ్మద్ మిథున్ సి హార్దిక్ పాండ్య బి అశ్విన్ 1, తమీమ్ ఇక్బాల్ స్టెంప్డ్ ధోనీ బి రవీంద్ర జడేజా 35, సబ్బీర్ రహ్మాన్ స్టెంప్డ్ ధోనీ బి సురేష్ రైనా 26, హకీబ్ అల్ హసన్ సి సురేష్ రైనా బి అశ్విన్ 22, మష్రాఫ్ మొర్తాజా బి రవీంద్ర జడేజా 6, మహమ్మదుల్లా సి రవీంద్ర జడేజా బి హార్దిక్ పాండ్య 18, సౌమ్య సర్కార్ సి విరాట్ కోహ్లీ బి ఆశిష్ నెహ్రా 21, ముష్ఫికర్ రహీం సి శిఖర్ ధావన్ బి హార్దిక్ పాండ్య 11, ముస్త్ఫాజుకర్ రహ్మాన్ రనౌట్ 0, షువగత హొమ్ నాటౌట్ 0, ఎక్‌స్ట్రాలు 5, మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 145.
వికెట్ల పతనం: 1-11, 2-55, 3-69, 4-87, 5-95, 6-126, 7-145, 8-145, 9-145.
బౌలింగ్: ఆశిష్ నెహ్రా 4-0-29-1, జస్‌ప్రీత్ బుమ్రా 4-0-32-0, అశ్విన్ 4-0-20-2, రవీంద్ర జడేజా 4-0-22-2, హార్దిక్ పాండ్య 3-0-39-2, సురేష్ రైనా 1-0-9-1.

టి-20 వరల్డ్ కప్ పురుషుల విభాగంలో గురువారం మ్యాచ్‌లు లేవు. శుక్రవారం రెండు మ్యాచ్‌లు జరుగుతాయ. మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్లు ఢీ కొంటాయ (మొహాలీ/ సాయంత్రం 3 గంటల నుంచి మొదలు). రెండో మ్యాచ్ దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతుంది (నాగపూర్/ రాత్రి 7.30 నుంచి ఆరంభం) . కాగా, మహిళల విభాగంలో గురువారం మూడు మ్యాచ్‌లు ఉన్నాయ. ఇంగ్లాండ్‌ను వెస్టిండీస్ (్ధర్మశాలలో), బంగ్లాదేశ్‌ను పాకిస్తాన్ (్ఢల్లీలో), ఆస్ట్రేలియాను శ్రీలంక (్ఢల్లీలో) ఢీ కొంటాయ.

చిత్రం... సబ్బీర్ రహ్మాన్‌ను అవుట్ చేసిన రైనాకు సహచరుల అభినందన