క్రీడాభూమి

స్మిత్ డబుల్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, డిసెంబర్ 16: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్ మూడో టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు బిగించింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీతో కదంతొక్కితే, మిచెల్ మార్ష్ శతకాన్ని నమోదు చేశారు. వీరిద్దరూ నాటౌట్‌గా నిలవగా, ఆస్ట్రేలియా
మూడో రోజు, శనివారం ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లకు 549 పరుగులు చేసింది. రెండో రోజు మూడు వికెట్లకు 203 పరుగులు చేసిన ఆసీస్ ఆ ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఉదయం ఆటను మొదలుపెట్టి, కేవలం షాన్ మార్ష్ వికెట్‌ను కోల్పోయింది. 28 పరుగులు చేసిన అతను మోయిన్ అలీ బౌలింగ్‌లో జో రూట్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. 248 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియాకు స్మిత్ (229 నాటౌట్), మిచెల్ మార్ష్ (181 నాటౌట్) ఐదో వికెట్‌కు అజేయంగా 301 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఇంగ్లాండ్ కంటే 146 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియాకు ఆరు వికెట్లు చేతిలో ఉన్నాయి. మ్యాచ్ నాలుగో రోజు ఒకటి రెండు సెషన్లు ఆడి, సాధ్యమైనంత భారీ స్కోరు సాధించి, ఆతర్వాత ఇంగ్లాండ్‌పై ఒత్తిడి తేవడానికి ఆస్ట్రేలియా ప్రయత్నించే అవకాశం ఉంది.

చిత్రాలు.. స్మిత్ (229 నాటౌట్) *మిచెల్ మార్ష్ (181 నాటౌట్)