క్రీడాభూమి

వర్షం పైనే ఇంగ్లాండ్ ఆశ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, డిసెంబర్ 17: ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ మూడో టెస్టులోనూ ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. నాలుగు రోజు ఆటలో మరిన్ని వికెట్లు కోల్పోకుండా రక్షించిన వర్షం, చివరి రోజైన సోమవారం కూడా ఆదుకుంటే తప్ప ఓటమి నుంచి తప్పించుకునే మార్గం ఇంగ్లాండ్‌కు లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రెండో ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ఇంకా 127 పరుగులు వెనుకంజలో ఉంది. చివరి రోజు ఆట ముగిసే వరకూ వికెట్లను రక్షించుకోగలిగితేనే, ఈ మ్యాచ్‌ని డ్రా చేసుకొని గట్టెక్కుతుంది. ఆస్ట్రేలియా ఇప్పటికే మొదటి రెండు టెస్టులను గెల్చుకొని, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌పై 2-0 ఆధిక్యాన్ని సంపాదించిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 403 పరుగులకు సమాధానంగా ఆస్ట్రేలియా 179.3 ఓవర్లలో 9 వికెట్లకు 662 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. స్టువ్ స్మిత్ 239, మిచెల్ మార్ష్ 181, ఉస్మాన్ ఖాజా 50, టిమ్ పైన్ 49 (నాటౌట్), పాట్ కమిన్స్ 41 చొప్పున పరుగులు సాధించారు. జేమ్స్ ఆండర్సన్ 116 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. క్రెగ్ ఓవర్టన్ 110 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చాడు. కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు వెనుకంజలో ఉన్న ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించి, నాలుగో రోజు ఆటను వర్షం కారణంగా నిలిపి వేసే సమయానికి 38.2 ఓవర్లలో, నాలుగు వికెట్లకు 132 పరుగులు చేసింది. అలస్టర్ కుక్ (14), మార్క్ స్టోన్‌మన్ (3), జేమ్స్ విన్స్ (55), కెప్టెన్ జో రూట్ (14) ఔట్‌కాగా, దావీద్ మలాన్ 28, జానీ బెయిర్‌స్టో 14 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరిని ఆస్ట్రేలియా ఎంత త్వరగా ఔట్ చేయగలిగితే ఆ జట్టు విజయావకాశాలు అంత మెరుగవుతాయి.