క్రీడాభూమి

టీమిండియాకు సెమీస్‌లో స్థానం సులభమేమీ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 24: బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో అతి కష్టం మీద ఒక పరుగు తేడాతో విజయం సాధించి రేస్‌లోనే ఉన్నప్పటికీ టీమిండియా సెమీ ఫైనల్ చేరడం అనుకున్నంత సులభమేమీ కాదు. గ్రూప్-2 నుంచి పోటీపడుతున్న భారత్ మూడు మ్యాచ్‌లు ఆడి, రెండు విజయాలను నమోదు చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను ఓడించగా, అంతకు ముందు న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. న్యూజిలాండ్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలవడంతో, ఎలాంటి ఇబ్బంది లేకుండా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌తో 26న జరిగే చివరి గ్రూప్ మ్యాచ్‌లోనూ గెలిచి, ఈ గ్రూప్‌లో అగ్రస్థానాన్ని కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్న కివీస్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా, రెండు విజయాలు సాధించిన భారత్‌కు 27న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. సెమీస్ చేరాలంటే ఆసీస్‌పై భారత్ తప్పక గెలవాలి. అయితే, నెట్న్ రేట్ మైనస్ 0.546గా ఉండడంతో కేవలం ఆసీస్‌ను ఓడిస్తే సెమీస్ చేరుతుందన్న గ్యారంటీ లేదు. పాకిస్తాన్‌తో 27న జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోతే భారత్‌కు కలిసొస్తుంది. ఒకవేళ పాక్‌పై ఆసీస్ గెలిస్తే, ఆ జట్టుతోనే జరిగే చివరి గ్రూప్ మ్యాచ్‌లో టీమిండియా అమీతుమీ తేల్చుకోవాలి. కాగా, ఆస్ట్రేలియా ఇప్పటి వరకూ రెండు మ్యాచ్‌లు ఆడి ఒక విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో పరాజయాన్ని ఎదుర్కొంది. బంగ్లాదేశ్‌పై భారత్ గెలవడంతో ఆసీస్ సమస్యలు పెరిగాయి. పాకిస్తాన్, భారత్‌తో జరిగే చివరి రెండు గ్రూప్ మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే తప్ప ఈ జట్టు సెమీస్‌కు చేరే అవకాశం లేదు. అంతేగాక, నెట్ రన్‌రేట్‌లో మెరుగైన స్థానాన్ని సంపాదించాలంటే భారత్‌ను భారీ తేడాతో ఓడించాలి. లేకపోతే ఆసీస్‌కు సెమీస్ చేరే అవకాశం ఉండదు. బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయంకాగా, పాకిస్తాన్ మూడు మ్యాచ్‌లు ఆడి, ఒక విజయాన్ని నమోదు చేసింది. రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. బంగ్లాదేశ్‌పై భారత్ గెలవడంతో పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది. రేస్‌లో ఉండాలంటే ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధించాలి. అంతేగాక, భారత్‌పై ఆస్ట్రేలియా గెలవాలని కోరుకోవాలి. ఒకవేళ భారత్ చేతిలో ఆస్ట్రేలియా ఓడితే, పాకిస్తాన్ ఇంటిదారి పట్టక తప్పదు. మొత్తం మీద గ్రూప్-2 నుంచి న్యూజిలాండ్ ఇప్పటికే సెమీ ఫైనల్స్ చేరగా, మరో స్థానానికి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పోరు తీవ్రంగా ఉంది. పాకిస్తాన్ కొన ఊపిరితో సెమీస్‌లో స్థానం కోసం ఎదురుచూస్తున్నది. ఈ గణాంకాలను చూస్తే, టి-20 వరల్డ్ కప్ సెమీస్ చేరడం టీమిండియాకు అసాధ్యం కాకపోయినా, సులభం మాత్రం కాదని స్పష్టమవుతున్నది.