క్రీడాభూమి

గెలిస్తేనే రేసులో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, మార్చి 24: టి-20 వరల్డ్ కప్ క్రికెట్ గ్రూప్-2లో అత్యంత కీలకమైన మ్యాచ్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే సెమీ ఫైనల్‌లో స్థానానికి రేసులో ఉండే అవకాశం దక్కుతుంది. ఓడిన జట్టు క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. పాకిస్తాన్ మూడు మ్యాచ్‌లు ఆడి రెండు పరాజయాలను చవిచూసింది. భారత్ చేతిలో 6 వికెట్ల తేడాతో, న్యూజిలాండ్ చేతిలో 22 పరుగులతో ఓటమిపాలైన పాకిస్తాన్ ఖాతాలో బంగ్లాదేశ్‌పై 55 పరుగుల ఆధిక్యంతో సాధించిన ఒక విజయం ఉంది. మొత్తం మీద రెండు ఓటములు, ఒక విజయంతో ఈ జట్టు సెమీస్ ఆశలను దాదాపుగా గల్లంతు చేసుకుంది. ఆస్ట్రేలియా చేతిలో ఓడితే ఇంటి దారి పట్టక తప్పని పరిస్థితి ఎదుర్కొంటున్నది. కాగా, ఆసీస్ జట్టు రెండు మ్యాచ్‌లు ఆడింది. బంగ్లాదేశ్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించిన ఈ జట్టు న్యూజిలాండ్ చేతిలో ఎనిమిది పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. పాకిస్తాన్‌తో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో గెలిస్తేనే సెమీస్ రేసులో ఉంటుంది. ఒకవేళ ఓడితే, భారత్‌తో 27న జరిగే మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. అయితే, అప్పటికీ సెమీస్‌లో స్థానం ఖాయమని చెప్పడానికి వీలు ఉండదు. భారత్ చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఏ విధంగా ఆడుతుందనే అంశంపైనే ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలు ఆధారపడ్డాయి. మొత్తం మీద గెలవకపోతే నిష్క్రమణ తప్పదన్న పరిస్థితుల్లో పాకిస్తాన్ మెడపై కత్తితో బరిలోకి దిగుతుండగా, రేసులో నిలిచి తన ఉనికిని కాపాడుకునేందుకు ఆసీస్ ప్రయత్నించనుంది. కాగితంపై చూస్తే పాక్ కంటే ఆసీస్ పటిష్టంగా కనిపిస్తున్నది. కానీ, అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమై, సర్వశక్తులు ఒడ్డే పాక్‌ను ఏ విధంగా ఎదుర్కొంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.
మ్యాచ్ శుక్రవారం సాయంత్రం 3 గంటలకు మొదలు.