క్రీడాభూమి

న్యూజిలాండ్ ఓపెన్‌లో ముగిసిన భారత్ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్లాండ్, మార్చి 25: న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో శుక్రవారం భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. జ్వాలా గుత్త, అశ్వనీ పొన్నప్ప సహా భారత జంటలన్నీ తమతమ ప్రత్యర్థుల చేతిలో వరుస గేముల తేడాతో ఓటముల పాలవడమే ఇందుకు కారణం. దీంతో ఈ టోర్నీలో భారత్ పోరు ముగిసింది. 2011లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు సాధించిన జ్వాలా గుత్త, అశ్వనీ పొన్నప్ప శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌కు చెందిన సెత్యానా మపాస, గ్రోన్యా సోమెర్‌విల్లీ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నారు. ఈ మ్యాచ్ ఆరంభంలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ తొలి గేమ్‌ను 22-24 తేడాతో కోల్పోయిన జ్వాలా, అశ్వనీ ఆ తర్వాత రెండో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేశారు. ఫలితంగా 8-21 తేడాతో ఆ గేమ్‌ను కూడా కోల్పోయి ఓటమి పాలయ్యారు. పురుషుల డబుల్స్‌లో ఆరో సీడ్ జోడీగా బరిలోకి దిగిన మను అత్రి, బి.సుమీత్ రెడ్డిలకు కూడా ఓటమి తప్పలేదు. గత ఏడాది డిసెంబర్‌లో మెక్సికో ఓపెన్‌లో విజేతలుగా నిలిచిన వీరు ప్రస్తుతం 10-21, 20-22 గేముల తేడాతో కొరియాకు చెందిన రెండో సీడ్ జోడీ కో సంగ్ హ్యున్, షిన్ బయెక్ చియోల్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నారు. అలాగే మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో చాయే యూ జంగ్‌తో కలసి బరిలోకి దిగిన షిన్ బయెక్ క్వార్టర్ ఫైనల్ పోరులో 21-14, 21-18 గేముల తేడాతో భారత్‌కు చెందిన ప్రణవ్ జెర్రీ చోప్రా, ఎన్.సిక్కీరెడ్డి జోడీని మట్టికరిపించింది.