క్రీడాభూమి

రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, మార్చి 25: ప్రస్తుతం జరుగుతున్న టీ-20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ముగిసిన తర్వాత క్రికెట్ నుంచి రిటైర్ కావడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పాకిస్తాన్ జట్టు కెప్టెన్ షహీద్ అఫ్రిదీ శుక్రవారం స్పష్టం చేశాడు. మొహాలీలో శుక్రవారం ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్‌కు ముందు టాస్ వేస్తున్నప్పుడు అఫ్రిదీ మాట్లాడుతూ, క్రికెట్ నుంచి రిటైర్ కావడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఏది ఏమైనా తమ దేశ ప్రజల ముందే ఆటకు గుడ్‌బై చెబుతానని అన్నాడు. రిటైర్మెంట్‌పై అఫ్రిదీ గతంలో ఒక అడుగు ముందుకి, మరో అడుగు వెనక్కి అన్నట్లుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఆస్ట్రేలియాతో ఆడుతున్నదే తన చివరి మ్యాచ్ కావచ్చని అఫ్రిదీ ఇంతకుముందు చెప్పాడు. 1996లో కెన్యాతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగిడిన అఫ్రిదీ ప్రస్తుత టి-20 ప్రపంచ కప్ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో పాటు న్యూజిలాండ్ చేతిలో పాక్ ఓటముల అనంతరం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఈ టోర్నీ ముగిసిన తర్వాత తమ జట్టు కెప్టెన్ పదవి నుంచి అఫ్రిదీని తొలగించనున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఇప్పటికే స్పష్టం చేసిన విషయం విదితమే.
ఇంటికెళ్లి, అందరితో చర్చించాక..
అయితే శుక్రవారం ఆస్ట్రేలియా చేతిలో పాక్ జట్టు ఓటమి అనంతరం అఫ్రిదీ మాట్లాడుతూ, స్వదేశానికి తిరిగి వెళ్లిన తర్వాత తన రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకుంటానని పునరుద్ఘాటించాడు. ‘దేశానికి ఏవిధంగా మంచి జరుగుతుందనుకుంటే ఆవిధంగానే నడుచుకుంటా. ప్రస్తుతం కెప్టెన్‌గా నేను ఫిట్‌గా లేకపోయినప్పటికీ ఆటగాడిగా ఫిట్నెస్‌తోనే ఉన్నా. కెప్టెన్సీని ఆస్వాదిస్తున్నా. అయినప్పటికీ అటు పిసిబి నుంచి, ఇటు మీడియా నుంచి నాపై వత్తిడి విపరీతంగా పెరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ నేను పాకిస్తాన్‌కు వెళ్లగానే నా ఫామ్‌ను పరిశీలించుకుంటా. కుటుంబ సభ్యులతో పాటు మాజీ కెప్టెన్ వసీం అక్రమ్‌తో చర్చించి రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకుంటా’ అని అఫ్రిదీ తెలిపాడు.