క్రీడాభూమి

అభిమాని ప్రాణం తీసిన ఆఖరి ఓవర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరఖ్‌పూర్, మార్చి 25: ఐసిసి ప్రపంచ టి-20 టోర్నమెంట్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తించిన చివరి ఓవర్ ఓ భారత అభిమాని ప్రాణాలను బలిగొంది. అనూహ్య పరిణామాలతో నిండిన ఆ ఓవర్‌లో అందరూ ఓడిపోతుందని భావించిన భారత్ చివరికి ఒక్క పరుగు తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం సాధించినందుకు అభిమానులంతా సంబరాల్లో మునిగిపోతే ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా బిస్టౌలీ గ్రామంలోని ఓం ప్రకాశ్ శుక్లా కుటుంబం మాత్రం శోకసంద్రంలో మునిగి పోయింది. చివరి ఓవర్‌లో విజయానికి బంగ్లాదేశ్ 11 పరుగులు చేయాల్సి ఉండగా, హర్దిక్ పాండ్యా వేసిన ఆ ఓవర్‌లో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ వరసగా రెండు బౌండరీలు కొట్టడంతో టీవీలో ఆ దృశ్యాన్ని వీక్షించిన శుక్లాకు గుండెపోటు వచ్చింది. మిగిలిన మూడు బంతుల్లో బంగ్లాదేశ్ వరసగా 3 వికెట్లు కోల్పోవడంతో భారత్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించడం తెలిసిందే. అయితే శుక్లామాత్రం ఆ ఆనందాన్ని చవిచూడలేక పోయాడు. గుండెపోటు వచ్చిన అతను ఆ తర్వాత రెండు గంటలకే ప్రాణాలు కోల్పోయాడు. చాలా సంవత్సరాలు ఢిల్లీలో ఓ కిరాణా దుకాణం నడిపిన శుక్లా ఆ తర్వాత గోరఖ్‌పూర్ వచ్చి స్థిరపడ్డాడు. ఆయనకు ముగ్గురు కుమారులున్నారు.