క్రీడాభూమి

అన్ని చోట్లా డోపింగ్ పరీక్షలు ఒకేలా ఉండాలి : ఫెదరర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మియామీ, మార్చి 25: టెన్నిస్ రంగం పెద్దగా డోపింగ్ సమస్యను ఎదుర్కోవడం లేదని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ అభిప్రాయ పడరతూ, అయితే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో డ్రగ్ పరీక్షల ప్రోటోకాల్‌ను సీరియస్‌గా తీసుకోకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశాడు. మోకాలి గాయం కారణంగా దాదాపు ఎనిమిది వారాల పాటు టెన్నిస్‌కు దూరంగా ఉండిన ఫెదరర్ ఇక్కడ జరుగుతున్న మియామీ ఓపెన్ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా గురువారం విలేఖరులతో మాట్లాడాడు. డోప్ టెస్టుల్లో మోసం చేసే వారికోసం వేటలో మరింత నిలకడతనం ఉండాలని ఫెదరర్ అంటూ ప్రపంచంలోని మిగతా ప్రాంతాలకన్నా తన సొంతదేశమైన స్విట్జర్లాండ్‌లోనే తాను ఎక్కువ సార్లు పరీక్షలకు గురయినట్లు చెప్పాడు.‘ పదేళ్లుగా నేను దుబాయిలో ఉంటున్నాను. అయితే ఒక సారి మాత్రమే పరీక్షలు జరిపారు. అది నాకు సరనిపించడం లేదు’ అని 34 ఏళ్ల ఫెదరర్ అన్నాడు. స్విట్జర్లాండ్‌లోనే తాను ఎక్కువ సార్లు పరీక్షలు చేయించుకున్నానని, ఎందుకంటే పరీక్షలు జరిపే వ్యక్తి తమ గ్రామంలోనే ఉండేవాడని,తన సర్జరీ జరిగిన మరుసటి రోజునుంచి అతను తనను చూడడానికి వచ్చే వాడని ఫెదరర్ చెప్పాడు. అయితే స్విట్జర్లాండ్‌లో మాదిరిగా ప్రపంచంలోని మిగతా ప్రాంతాల్లో డోపింగ్ టెస్టులను సీరియస్‌గా తీసుకోవడం లేదని, అన్ని చోట్లా ఒకే మాదిరిగా ఉంటే బాగుంటుందని ఫెదరర్ అభిప్రాయ పడ్డాడు. అయితే టెన్నిస్ విషయంలో ఇది పెద్ద సమస్యగా లేదని ఆయన అభిప్రాయ పడ్డాడు. రష్యా క్రీడాకారిణి షరపోవా డ్రగ్స్ పరీక్షలో పట్టుబడడం పట్ల ఫెదరర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అంతేకాదు తాను తీసుకునే మెల్డోనియంను ‘వాడా’ నిషేధిత డ్రగ్స్ జాబితాలో చేర్చిన విషయం తనకు తెలియదని ఆమె చెప్పడం మరింత ఆశ్చర్యం కలిగించిందని ఆయన అన్నాడు. ‘మనం తీసుకునే మందులు ఏమిటో మనకు తెలిసి ఉండాలి. నేను ఏదయినా మందు తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుంటాను’ అని ఫెదరర్ చెప్పాడు. డోపింగ్ మోసాలను అరికట్టడానికి పదేళ్ల పాటు ప్రతి ఈవెంట్ తర్వాత బ్లడ్ టెస్టులు జరపాలని , దీనివల్ల చాలా ఏళ్ల తర్వాత కూడా నిబంధనలు ఉల్లంఘించారో లేదో తెలుసుకోవడం కోసం అత్యాధునిక పద్ధతులను ఉపయోగించడానికి వీలవుతుందని ఫెదరర్ అభిప్రాయ పడ్డాడు.