క్రీడాభూమి

మియామీ ఓపెన్ టెన్నిస్ అజరెన్కా ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మియామీ, మార్చి 26: మియామీ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ విక్టోరియా అజరెన్కా మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. ఇటీవల జరిగిన ఇండియన్ వెల్స్ టోర్నీ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్‌ను ఓడించి సంచలనం సృష్టించిన ఆమె రెండో రౌండ్‌లో 6-2, 6-4 తేడాతో మోనికా పగ్‌పై విజయం సాధించింది. కాగా, ఎవరూ ఊహించని విధంగా ఇండియన్ వెల్స్ ఫైనల్‌లో ఓడిన సెరెనా కూడా మూడో రౌండ్ చేరింది. రెండో రౌండ్‌లో ఆమె క్రిస్టినా మెక్‌హాలెపై 6-3, 5-7, 6-2 తేడాతో గెలిచింది. గార్బిన్ ముగురుజా 6-7, 6-3, 7-5 స్కోరుతో డొమినికా సిబుల్కొవాను ఓడించింది. ఆండ్రియా పెట్కోవిచ్‌ను కరోలిన్ గార్సియా 7-6, 3-6, 7-5, కరినా వితాఫ్‌ను స్వెత్లానా కుజ్నెత్సొవా 6-3, 4-6, 6-4 తేడాతో ఓడించి ముందంజ వేశారు. ఇతర కీలక మ్యాచ్‌ల్లో ఎలినా స్విటొలినా, కరోలినా వొజ్నియాకి, ఎకతరిన మకరొవా, పెట్రా క్విటోవా, అగ్నీస్కా రద్వాన్‌స్కా, మాడిసన్ బ్రింగిల్, తిమియా బాసిన్‌స్కీ, అనా ఇవానోవిచ్, సిమోనా హాలెప్ యానినా విక్‌మేయర్ తమతమ ప్రత్యర్థులపై విజయాలను నమోదు చేశారు.
వైదొలగిన ఫెదరర్
ప్రపంచ మాజీ నంబర్ వన్ ఆటగాడు రోజర్ ఫెదరర్ టోర్నీ నుంచి చివరి క్షణాల్లో వైదొలిగాడు. ఫిట్నెస్ సమస్యను ఎదుర్కొంటున్న అతను ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా, ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకొవిచ్ రెండోరౌండ్‌లో ఎడ్మంట్‌ను 6-3, 6-3 తేడాతో ఓడించి ముందంజ వేశాడు. డోమినిక్ థియెమ్ 7-5, 6-2 తేడాతో క్రొరొట్‌పై, నిషియోకా 6-4, 6-4 ఆధిక్యంతో లొపెజ్‌పై విజయాలు సాధించారు. ఇతర కీలక మ్యాచ్‌ల్లో డొమినిక్ థియెమ్, రిచర్డ్ గాస్క్వెట్, పైర్ బెనోట్, స్టీవ్ జాన్సన్, బెర్డిచ్, డేవిడ్ ఫెరర్, డేవిడ్ గోఫిన్ తమతమ ప్రత్యర్థులను ఓడించారు.

chitram విక్టోరియా అజరెన్కా