క్రీడాభూమి

ఆసీస్ చేతిలో ఐర్లాండ్ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: మహిళల టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ పోటీల్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఆస్ట్రేలియా మరో 40 బంతులు మిగిలి ఉండగానే, ఏడు వికెట్ల తేడాతో చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 91 పరుగులు సాధించింది. క్లారే షిల్లింగ్‌టన్ 22, సెసలియా జాయిస్ 23, కిమ్ గార్త్ 27 పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మెగాన్ షట్ 29 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టింది. రెన్ ఫేర్‌వెల్ 11 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో, మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఎలిస్ విలానీ 43, ఎలిస్ పెర్రీ 29 (నాటౌట్) పరుగులతో ఆసీస్‌కు సునాయాస విజయాన్ని అందించారు.
న్యూజిలాండ్ దూకుడు
బెంగళూరు: దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ దూకుడుగా ఆడింది. ప్రత్యర్థిని 19.3 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం లక్ష్యాన్ని 14.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయ ఛేదించింది.
టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా, దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ పేలవంగా సాగింది. మరిజనె కాప్ 22 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిస్తే, డేన్ వాన్ నికెర్క్ 18, లిజెల్ లీ 15 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్‌విమెన్ ఏ దశలో నూ న్యూజిలాండ్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేక చేతులెత్తేశారు. కివీస్ బౌలర్లలో సోఫీ డివైన్ 16 పరుగులకు మూడు, లీ కాస్పరెట్ 19 పరుగులకు మూడు చొప్పున వికెట్లు పడగొట్టారు.
కేవలం 100 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు కివీస్ ఇన్నింగ్స్‌ను ఆరం భించిన రాచెల్ ప్రీస్ట్, సుజీ బేట్స్ మొదటి వికెట్‌కు 8.2 ఓవర్లో 57 పరుగులు జోడించారు. బేట్స్ 29 పరుగులు చేసి మసబతా క్లస్ బౌలింగ్‌లో డు ప్రీజ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైంది. ప్రీస్ట్ 28 పరుగులు సాధించి, వాన్ నికెర్క్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగింది. సారా మెక్‌గ్లాషన్ ఐదు పరుగులకే అవుటైంది. సోఫీ డివైన్ 27, కాటీ మార్టిన్ 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, ఇంకా 33 బంతు లు మిగిలి ఉండగానే కివీస్‌ను గెలిపించారు.