క్రీడాభూమి

లంకను ఓడించి సెమీస్‌కు ఇంగ్లాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల మ ధ్య శనివారం జరిగిన గ్రూప్ మ్యాచ్ చివరి క్షణం వ రకూ ఉత్కంఠ రేపింది. ఓటమి ఖాయంగా కనిపిం చిన లంక ఒకానొక దశలో విజయంపై అభిమాను ల్లో ఆశలు రేపింది. కానీ, లక్ష్యానికి పది పరుగుల దూరంలో నిలిచిపోయంది. కెప్టెన్ ఏంజెలో మా థ్యూస్ చేసిన ఒంటరి పోరాటం ఫలించలేదు. ఇం గ్లాండ్ విజయభేరి మోగించి, టి-20 వరల్డ్ కప్ సె మీ ఫైనల్‌లో స్థానంసంపాదించుకుంది
మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 20 ఓవర్ల లో 4 వికెట్లు చేజార్చుకొని 171 పరుగులు సాధిం చింది. జొస్ బట్లర్ అజేయంగా 66 పరుగులు చేశా డు. జాసన్ రొయ్ 42, జో రూట్ 25, ఇయాన్ మో ర్గాన్ 22 చొప్పున పరుగులు సాధించడంతో ఇం గ్లాండ్ మెరుగైన స్కోరును నమోదు చేయగలిగింది. శ్రీలంక బౌలింగ్ పేలవంగా కొనసాగింది. జెఫ్రీ వాన్ డెర్‌సే 26 పరుగులకు రెండు వికెట్లు కూల్చాడు. అ తనిని మినహాయస్తే లంక బౌలర్లు ఎవరూ ఇంగ్లాం డ్ బ్యాట్స్‌మెన్‌పై పెద్దగా ప్రభావం చూపలేకపో యారు. లంక బౌలింగ్ వైఫల్యమే ఇంగ్లాండ్ విజ యానికి పునాదులు వేసింది.
సెమీస్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకోవడా నికి 172 పరుగులు సాధించాల్సి ఉండగా, లంక కే వలం 15 పరుగులకే నాలుగు కీలక వికెట్లు చేజా ర్చుకుంది. దినేష్ చండీమల్ (1), తిలకరత్నే దిల్షాన్ (2), మిలింద సిరివర్ధన (7), లాహిరు తిరిమానే (3) పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయతే, కెప్టెన్ మా థ్యూస్ క్రీజ్‌లో నిలదొక్కుకొని, చమర కపుగతెరా తో కలిసి ఐదో వికెట్‌కు 80 పరుగులు జోడించాడు. తిసర పెరెరా (20)తో ఆరో వికెట్‌కు 42 పరుగులు జత కలిపాడు. దుసన్ షనక (15) క్రీజ్‌లో ఉన్నంత సేపు లంక విజయం ఖాయంగా కనిపించింది. 19వ ఓవర్‌లో ఏడు పరుగులు లభించగా, రెండు వికెట్లు కూలాయ. షనక, రంగన హెరాత్ అవుటయ్యారు. దీనితో చివరి ఓవర్‌లో లంకకు 15 పరుగులు అవ సరమయ్యాయ. బెన్ స్టోక్స్ వేసిన ఆ ఓవర్ మొదటి బంతిని మాథ్యూస్ రక్షణాత్మకంగా ఆడాడు. రెండో బంతిలో రెండు, మూడో బంతికి మరో రెండు చొ ప్పున పరుగులు చేశాడు. ఈ దశలో స్టోక్స్ వ్యూహా త్మకంగా బంతులు వేశాడు. ఫలితంగా చివరి మూ డు బంతుల్లో ఒక్క పరుగు కూడా సాధించలేకపో యన లంక 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయ 161 పరుగులు చేయగలిగింది. ఏంజెలో మాథ్యూస్ 54 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, ఐదు సిక్సర్ల తో అజేయంగా 73 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ 10 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు దూసు కెళ్లింది. ఈ గ్రూప్ నుంచి వెస్టిండీస్ ఇప్పటికే సెమీస్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
సంక్షప్త స్కోర్లు
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టాని కి 171 (జొస్ బట్లర్ 66 నాటౌట్, జాసన్ రొయ్ 42, జో రూట్ 25, ఇయాన్ మోర్గాన్ 22, జెఫ్రీ వాండర్సే 26 పరుగులకు రెండు విక్ప్ఘొట్లు).
శ్రీలంక ఇన్నింగ్స్: 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 161 (ఏంజెలో మాథ్యూస్ 73 నాటౌట్, క పుగడేర 30, తిసర పెరెరా 20, షనక 15, క్రిస్ జో ర్డాన్ 4/28, డేవిడ్ విల్లీ 2/26).