క్రీడాభూమి

ప్లేయంగ్ ఎలెవెన్‌లో పార్థీవ్, రాహుల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, జనవరి 12: దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగే రెండో టెస్టులో కనీసం రెండు మార్పులతో టీమిండియా బరిలోకి దిగుతుందని సమాచారం. బీసీసీఐ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ పార్థీవ్ పటేల్, ఓపెనర్ లోకేష్ రాహుల్‌కు ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు కల్పించనున్నారు. బ్యాటింగ్‌లో రాణించలేకపోతున్న వృద్ధిమాన్ సాహా, శిఖర్ ధావన్ స్థానంలో పార్థీవ్, రాహుల్ వస్తారు. కేప్ టౌన్‌లో జరిగిన మొదటి టెస్టులో కీపర్‌గా సాహా ప్రతిభ చూపినప్పటికీ, బ్యాట్స్‌మన్‌గా విఫలమయ్యాడు. బ్యాట్స్‌మన్‌గా అతని కంటే పార్థీవ్ సమర్థుడన్నది వాస్తవం. 23 టెస్టుల్లో 878 పరుగులు సాధించిన పార్థీవ్ ఫుట్‌వర్క్ అద్భుతంగా ఉంటుంది. బ్యాక్ ఫుట్‌లో ఆడడం అతని అలవాటు. సాహా ఫ్రంట్ ఫుట్‌లో ఆడడం వల్ల ఎల్‌బీగా ఔటయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగానే సాహాకు బదులు పార్థీవ్‌ను తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. జట్టు మేనేజ్‌మెంట్ కూడా దాదాపు ఇదే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. కాగా, దక్షిణాఫ్రికా పిచ్‌లపై అద్భుతంగా ఆడతాడనుకున్న ధావన్ ఇంకా వైఫల్యాల బాటను వీడలేదు. అందుకే రాహుల్‌ను జట్టులోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది.
కేప్ టౌన్ మాదిరిగా సెంచూరియన్ పిచ్‌పై బంతి విపరీతంగా స్వింగ్ కాదు. అందుకే, భువనేశ్వర్ కుమార్‌ను బెంచ్‌కి పరిమితం చేసి, అతని స్థానంలో ఇశాంత్ శర్మను తీసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ మార్పు ఇంకా ఖరారు కాలేదు. అయితే, సాహా, ధావన్‌కు బదులు పార్థీవ్, రాహుల్ రాక మాత్రం ఖాయమని అంటున్నారు.