క్రీడాభూమి

నన్ను నేను నిరూపించుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 12: తన తండ్రి సచిన్ తెండూల్కర్ ముద్ర లేకుండా తనను తాను నిరూపించుకుంటానని అర్జున్ తెండూల్కర్ స్పష్టం చేశాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ) ఆధ్వర్యంలో జరుగుతున్న స్పిరిట్ ఆఫ్ క్రికెట్ గ్లోబల్ చాలెంజర్ టోర్నమెంట్‌లో అతను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తరఫున ఆడుతున్నాడు. హాంకాంగ్ క్రికెట్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లో 48 పరుగులు చేసిన అతను, నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టి ఆల్‌రౌండ్ ప్రతిభ చాటాడు. తండ్రి సచిన్ కుడి చేతి వాటం బ్యాట్స్‌మన్‌కాగా, అర్జున్ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్. బ్యాటింగ్ అంటే ఇష్టం ఉందని, అయితే, ఫాస్ట్ బౌలర్‌గానే స్థిరపడాలన్నదే తన ధ్యేయమని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్జున్ చెప్పాడు. బ్యాటింగ్ విభాగంలో దాదాపు అన్ని రికార్డులనూ తన ఖాతాలోనే వేసుకున్న సచిన్‌కు పరుగుల రారాజుగా మంచి పేరు ఉంది. అతని కొడుకుగానే ప్రతి ఒక్కరూ అర్జున్‌ను చూస్తున్నారు. అయితే, తనను తాను నిరూపించుకోవడానికి కృషి చేస్తున్నానని అర్జున్ అన్నాడు. మిచెల్ స్టార్క్, బెన్ స్టోక్స్ అంటే తనకు చాలా ఇష్టమని, వారిని అనుసరించేందుకే ఇష్టపడతానని 18 ఏళ్ల అర్జున్ తెలిపాడు. సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ పేరుతో ఉన్న మైదానంలో మ్యాచ్‌లు ఆడడం తనకు ఆనందంగా ఉందన్నాడు.