క్రీడాభూమి

ఇక్కడే టేకాఫ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చి, జనవరి 12: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ వంటి ఎంతో మంది ప్రతిభావంతులను అంతర్జాతీయ క్రికెట్‌కు అందించిన అండర్-19 వరల్డ్ కప్ మరోసారి అభిమానులను అలరించడానికి సిద్ధమైంది. శనివారం నుంచి మొదలయ్యే ఈ టోర్నమెంట్‌లో ఎంత మంది యువ క్రికెటర్లు తమతమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకుంటారో, అంతర్జాతీయ క్రికెట్‌లోకి దూసుకొచ్చి సంచలనం సృష్టిస్తారో చూడాలి. తమ ప్రతిభాపాటవాలతో సెలక్టర్లను ఆకట్టుకొని, జాతీయ జట్లకు ఎంపికయ్యేందుకు తొలి ప్రయాణం చాలా మందికి ఇక్కడి నుంచే మొదలవుతుంది. గతంలో ఈ టోర్నీ నుంచే పలువురు అంతర్జాతీయ క్రికెట్‌లోకి దూసుకొచ్చారు. అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్), బాబర్ ఆజం (పాకిస్తాన్), ఒక సింగిల్ టోర్నమెంట్‌లో ఎక్కువ పరుగులు చేసిన శిఖర్ ధావన్ (్భరత్), ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచిన కామెరాన్ వైట్ వంటి ఎంతో మంది కెరీర్‌లో అత్యున్నత శిఖరాలను అందుకున్నారు. క్రిస్ గేల్ (వెస్టిండీస్), రాంనరేష్ శర్వాణ్ (వెస్టిండీస్), యువరాజ్ సింగ్ (్భరత్), గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా), టటేండా టైబూ (జింబాబ్వే), చటేశ్వర్ పుజారా (్భరత్), మోజెస్ హెన్రిక్స్ (ఆస్ట్రేలియా) కూడా అండర్-19 వరల్డ్ కప్‌లో సత్తా చాటి, తమతమ దేశాలకు ప్రాతినిథ్యం వహించిన వారే. బౌలర్లు ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్), జీవన్ మేండిస్ (శ్రీలంక), వేన్ పార్నెల్ (దక్షిణాఫ్రికా), ఇమానుల్ హక్ (బంగ్లాదేశ్), ముస్తాక్ అహ్మద్ (పాకిస్తాన్), జేవియర్ దొహెర్తీ తదితరులు ఇదే వేదిక నుంచే సూపర్ స్టార్లుగా ఎదిగారు. అందుకే, క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ రెండేళ్లకోసారి జరిగే అండర్-19 వరల్డ్ కప్‌లో ఆడాలని, అక్కడ సత్తా చాటడం ద్వారా జాతీయ జట్లలో చోటు సంపాదించాలని కలలు కంటారు. పృథ్వీ షా నాయకత్వంలో ఈ టోర్నమెంట్‌లో పోటీపడుతున్న భారత జట్టులో శుభం గిల్, అభిషేక్ శర్మ, హిమాంశు రాణా వంటి సమర్థులు ఉన్నారు. పృథ్వీ షా ఇప్పటికే రంజీ ట్రోఫీలో రికార్డులు సృష్టించి, జాతీయ సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కాలంటే అతను ఈ టోర్నీలో రాణించాల్సిన అవసరం ఉంది. అంతేగాక, ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం కూడా త్వరలోనే జరగనున్నందున ఈ టోర్నీ మరింత ప్రా ధాన్యతను సంతరించుకుంది. మొత్తం మీద భవిష్యత్తులో స్టార్లుగా ఎదిగే సత్తావున్న ఎంతో మందికి టేకాఫ్‌నిచ్చే అండర్-19 వరల్డ్ కప్‌లో టైటిల్ ఎవరికి దక్కినా, పోరు మాత్రం తీవ్ర స్థాయిలోనే ఉంటుందనేది వాస్తవం.
ద్రవిడ్ మార్గదర్శకమే బలం..
అండర్-19 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు మాజీ క్రికెటర్ ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకం బలాన్నిస్తున్నది. కోచ్‌గా భారత్ ‘ఏ’తోపాటు అండర్-19 జట్టుకు కూడా ద్రవిడ్ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. తాను స్వయంగా యువ క్రికెటర్లను ప్రోత్సహించడమేగాక, వారికి మరింత మద్దతు తెలపాలని ద్రవిడ్ తన మాజీ సహచరులకు, అభిమానులకు పిలుపునిచ్చాడు. అండర్-19 జట్టులోని సభ్యులంతా తమ సత్తా నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ విషయాన్ని అంతా ప్రత్యక్షంగా చూస్తారని ఒక ఇంటర్వ్యూలో అ తను స్పష్టం చేశాడు. భారత క్రికెట్ జట్టులోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లోని ఒకడిగా వెలుగొందిన రాహుల్ ద్రవిడ్ టెస్టుల్లో 13,288 పరుగులు చేశాడు. వనే్డ ఇంటర్నేషనల్ టోర్నీలలో 10,889 పరుగులు చేశాడు. అంతర్జాతీయ పోటీల్లో తన కెరీర్‌లో 48 సెంచరీలు సాధించాడు. ఆటలో ఎంతో ఓపిక, సహనంతో ఉండే ద్రవిడ్ తాను ఇంత ఎత్తుకు ఎదగడానికి అవే కారణమంటాడు. మైదానంలో ద్రవిడ్ ఆటతీరు, వ్యవహారశైలి, భారత్‌కు వివిధ రకాలుగా అందించిన సేవల వల్లనే గౌరవప్రదమైన అవకాశాలు ఎన్నో వరిస్తున్నాయి. ద్రవిడ్ భారత జట్టులో భాగస్వామిగా ఉన్నపుడు ప్రముఖ క్రికెటర్లు సచిన్ తెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ వంటివారు అతనితో కలసి ఆడిన వారే. అంతర్జాతీయ క్రికెట్‌లో అపారమైన అనుభవం ఉన్న ద్రవిడ్ ఇప్పుడు యువ క్రికె టర్లను విజయపథంలో నడిపించే బాధ్యతను తీసుకున్నాడు. అత ని అంచనాలకు తగినట్టు భారత అండర్-19 జట్టు రాణిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.