క్రీడాభూమి

ఇంగ్లాండ్ చేతిలో పాక్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 27: మహిళల టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ లో పాకిస్తాన్‌పై ఇంగ్లాండ్ 68 పరుగుల తేడాతో గెలిచింది. చార్లొట్ ఎడ్వర్డ్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లాండ్‌ను విజయంలో కీలక పాత్ర పోషించింది. 149 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించ లేకపోయన పాకిస్తాన్ 17.5 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూలింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు చార్లొట్ అండగా నిలిచింది. ఆమె క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడగా, టామీ బ్యూవౌంట్ 37, నతాలీ షివర్ 15, డానియేల వ్యాట్ 17 చొప్పు న పరుగులు సాధించారు. చార్లొట్ 61 బంతులు ఎదుర్కొని, 10 ఫోర్లతో 77 పరుగులు సా ధించి నాటౌట్‌గా నిలిచింది. పాక్ బౌలర్లలో నిదా దర్ 21 పరుగులిచ్చి 3 వికెట్లు కూల్చింది. అస్మావియా ఇక్బాల్ 18 పరుగులకు రెండు వికెట్లు సాధించింది.
విజయానికి 149 పరుగులు సాధించాల్సి ఉండగా కాథెరీన్ బ్రంట్ వేసిన మొదటి ఓవర్‌లోనే సింద్రా అమీన్ (0) వికెట్‌ను పాక్ కోల్పోయంది. ఆతర్వాత కోలుకోలేకపోయంది. నిదా దర్ 16 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, నహిదా ఖాన్, అస్మావియా ఇక్బాల్ చెరి 15 పరు గులు చేశారు. పాక్ మరో 19 పరుగులు మిగిలి ఉండగానే ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో లారా మార్ష్ 12 పరుగులకు మూడు వికెట్లు కూల్చింది.