క్రీడాభూమి

ఐపీఎల్ వేలానికి స్టార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) త్వరలో నిర్వహించనున్న ఐపీఎల్‌కు సంబంధించిన క్రీడాకారుల ఎంపిక కోసం నిర్వహించే వేలం జాబితాను ప్రకటించింది. బెంగుళూర్‌లో ఈనెల 27, 28 తేదీల్లో వేలం నిర్వహించనున్నారు. దాదాపు 1,122 మంది క్రికెటర్లు వేలం కిందకు రానున్నారు. వీరిలో దక్షిణాఫ్రికాకు చెందిన క్రిస్ గేల్, భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, స్పిన్నర్ అశ్విన్, ఇంగ్లాండ్‌కు చెందిన జో రూట్, ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్ వంటి మేటి స్టార్లు ఉన్నారు. వీరేకాకుండా భారత్ క్రికెటర్లు గౌతం గంభీర్, అజింక్య రహానే, స్పిన్నర్ కులదీప్ యాదవ్, ఓపెనర్లు లోకేష్ రాహుల్, మురళీ విజయ్ తదితరులు కూడా ఈ వేలం కిందనే వివిధ ఫ్రాంచైజీలకు ఎంపికకానున్నారు.
ఇదిలావుండగా, వేలం కోసం వచ్చిన ఆటగాళ్ల జాబితాను ఎనిమిది ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలకు అందజేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 1122 మంది క్రీడాకారుల్లో 281 అంతర్జాతీయ క్రీడా వేదికలపై ఆడినవారుకాగా, 838 మంది అంతర్జాతీయ క్రీడా వేదికలపై ఇంతవరకు ఆడలేదు. మొత్తం క్రీడాకారుల జాబితాలో 778 మంది భారత క్రికెటర్లు ఉండగా, వీరిలో ముగ్గురు ఆటగాళ్లు అసోసియేట్ నేషన్స్‌కు చెందినవారు. ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు 282 మంది ఉండగా, వీరిలో 58 మంది ఆస్ట్రేలియా, 57 మంది దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌లకు చెందినవారు 39 మంది వంతున, 30 మంది న్యూజిలాండ్, 26 మంది ఇంగ్లాండ్‌కు చెందినవారు ఉన్నారు.
ఇదిలావుండగా, ఈ క్రీడాకారుల్లో కొంతమంది ఐపీఎల్‌లో తమకు తప్పకుండా అవకాశం వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. వారిలో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్ జట్టు తరఫున ఐపీఎల్‌లో ఆడి బౌలింగ్ చేసిన గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ జాన్సన్ వంటి వారు కూడా ఉన్నారు. వీరు గత ఐపీఎల్ సీజన్‌లోని ఆఖరి ఓవర్లో తమదైన శైలిలో బౌలింగ్ చేయడం ద్వారా ముంబై జట్టు టైటిల్ సాధించడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ రూట్, బెన్ స్టోక్స్, క్రిస్ లీన్, ఇయాన్ మోర్గాన్, పేసర్లు బ్రేవో, కార్లోస్ బ్రాత్‌వైట్, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్ వంటి అగ్రశేణి క్రికెటర్లు కూడా ఈ వేలం జాబితాలో ఉన్నారు. అదేవిధంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఐపీఎల్ 10లో ఆడి రెండు సెంచరీలు చేసిన హసీమ్ ఆమ్లా, వేలంలో ఎక్కువగా అమ్ముడుపోయేవారిలో తాను కూడా ఉన్నానని భావిస్తున్న డుప్లెసిస్, క్వింటన్ డి కాక్, డేవిడ్ మిల్లర్, బౌలింగ్‌లో అత్యంత ప్రతిభావంతుడిలో ఒకడిగా వినుతికెక్కిన మోర్న్ మోర్కెల్, కొలిన్ మన్రో, న్యూజిలాండ్‌కు చెందిన టామ్ లథమ్‌తో పాటు ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన ఎనిమిది మంది, ఐర్లాండ్‌కు చెందిన ఇద్దరు, జింబాబ్వేకు చెందిన ఏడుగురు, అమెరికాకు చెందిన ఇద్దరు క్రికెటర్లు కూడా ఈ వేలం జాబితాలో ఉన్నారు.

అశ్విన్, యువరాజ్ సింగ్ (ఫైల్ ఫొటో)