క్రీడాభూమి

చెలరేగిన బౌల్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డ్యునెడిన్, జనవరి 13: ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ సూపర్ స్పెల్ ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మూడో వనే్డలో న్యూజిలాండ్‌కు 183 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సాధించిపెట్టింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను కివీస్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. కాగా, చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి, పాకిస్తాన్‌కు వైట్‌వాష్ వేయడమే లక్ష్యమని కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ స్పష్టం చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 257 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ 45, కేన్ విలియమ్‌సన్ 73, మాజీ కెప్టెన్ రాస్ టేలర్ 52, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ టామ్ లాథమ్ 35 చొప్పున పరుగులు చేయడంతో న్యూజిలాండ్‌కు ఈ స్కోరు సాధ్యమైంది. ఇన్నింగ్స్ చివరి బంతికి ట్రెంట్ బౌల్ట్ (13) ఔటయ్యాడు. రుమాన్ రరుూస్ 51 పరుగులకు మూడు, హసన్ అలీ 59 పరుగులకు మూడు చొప్పున వికెట్లు పడగొట్టారు. షాదాబ్ ఖాన్ 51 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు. ఫహీం అషత్‌క్రు ఒక వికెట్ లభించింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ తన వనే్డ చరిత్రలోనే రెండో అత్యల్ప స్కోరుతో చేతులెత్తేసింది. 27.2 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ (14 నాటౌట్), ఫహీం అషఫ్ (10), చివరిలో మహమ్మద్ అమీర్ (14), రుమాన్ రరుూస్ (16) మాత్రమే పాక్ తరఫున రెండంకెల స్కోర్లు చేయగలిగారు. రరుూస్ చేసిన 16 పరుగులకే పాక్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరుగా నమోదైందంటే, ఆ జట్ట బ్యాట్స్‌మెన్ ఏ విధంగా విఫలమయ్యారో ఊహించడం కష్టం కాదు. 7.2 ఓవర్లు బౌల్ చేసిన బౌల్ట్ కేవలం 17 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. కొలిన్ మున్రో, లొకీ ఫెర్గూసన్ చెరి రెండు వికెట్లు సాధించారు.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 257 ఆలౌట్ (మార్టిన్ గుప్టిల్ 45, కేన్ విలియమ్‌సన్ 73, రాస్ టేలర్ 52, టామ్ లాథమ్ 35, రుమాన్ రరుూస్ 3/51, హసన్ అలీ 3/59, షాదాబ్ ఖాన్ 2/51).
పాకిస్తాన్ ఇన్నింగ్స్: 27.2 ఓవర్లలో 74 ఆలౌట్ (సర్ఫ్‌రాజ్ అహ్మద్ 14 నాటౌట్, ఫహీం అషఫ్ 10, మహమ్మద్ అమీర్ 14, రుమాన్ రరుూస్ 16, ట్రెంట్ బౌల్ట్ 5/17, కొలిన్ మున్రో 2/10, లాకీ ఫెర్గూసన్ 2/28).

చిత్రం..ట్రెంట్ బౌల్ట్