క్రీడాభూమి

అదేం ఎంపిక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, జనవరి 13: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండవ టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు ఎంపికపై మాజీ కెప్టెన్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో కేఎల్ రాహును ఎంపిక చేయడంతోపాటు భువనేశ్వర్ కుమార్ స్థానంలో ఇషాంత్ శర్మను జట్టులోకి తీసుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించాడు. తన ఉద్దేశంలో మాత్రం శిఖర్‌ధావన్‌ను బలిపశువును చేశారని ఆయన వ్యాఖ్యానించాడు. ఒక ఇన్నింగ్స్‌లో బాగా ఆడనంతమాత్రాన అతనిని జట్టులోకి తీసుకోరా అని ఆయన ప్రశ్నించాడు. అదేవిధంగా వికెట్ కీపర్ వృద్ధిమాన్ షా స్థానంలో పార్థివ్ పటేల్‌ను తీసుకోవడం కూడా ఆక్షేపణీయమని అన్నాడు. కేప్‌టౌన్‌లో జరిగిన మొదటి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్ స్థానంలో ఇషాంత్ శర్మను తీసుకోవడంలో అర్ధం లేదని, భువనేశ్వర్ లేని లోటును ఇషాంత్ భర్తీ చేయగలడా అని ఆయన ప్రశ్నించాడు.