క్రీడాభూమి

మెయిన్ డ్రాకు భంబ్రీ క్వాలిఫై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్: గత సీజన్ నుంచి చక్కటి ప్రతిభతో రాణిస్తున్న భారత ఆటగాడు యుకీ భంబ్రీ ఆస్ట్రేలియా ఓపెన్ మెయిన్ డ్రాకు క్వాలిఫై అయ్యాడు. చివరిదైన మూడో క్వాలిఫయర్‌లో అతను కెనడాకు చెందిన పీటర్ పొలాన్‌స్కీని 1-6, 6-3, 6-3 తేడాతో ఓడించాడు. మొదటి సెట్‌ను చేజార్చుకున్నప్పటికీ, ఆతర్వాత రెండు సెట్లలో అతను ఎదురుదాడికి దిగి, విజయాన్ని నమోదు చేశాడు. 2015, 2016 సంవత్సరాల్లోనూ 25 ఏళ్ల యుకీ ఈ టోర్నమెంట్‌కు అర్హత సంపాదించాడు. అయితే, రెండు పర్యాయాలూ అతని పోరాటం మొదటి రౌండ్‌కే పరిమితమైంది. మొదటిసారి ఆండీ ముర్రే చేతిలో, రెండోసారి తొమాస్ బెర్డిచ్ చేతిలో అతను పరాజయాలను చవిచూశాడు.

చిత్రం.. యుకీ భంబ్రీ