క్రీడాభూమి

భారీ ప్రైజ్‌మనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్: టెన్నిస్ రంగంలో గ్రాండ్ శ్లామ్స్‌లోనేగాక, మరే ఇతర టోర్నీలోనూ లేనంత ప్రైజ్‌మేనీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఉంటుంది. ఇటీవలే ప్రైజ్‌మనీ మొత్తాన్ని 40 మిలియన్ డాలర్లకు పెంచారు. పురుషులు, మహిళల విభాగాల్లో టైటిళ్లను సాధించిన వారికి చెరి 3.1 మిలియన్ డాలర్లు లభిస్తాయి. మొదట్లో ఈ రెండు విభాగాల్లో విజేతకు లభించే మొత్తాలు వేరువేరుగా ఉండేవి. కానీ, పలువురు క్రీడాకారిణులు నిరసన వ్యక్తం చేయడంతో ప్రైజ్‌మనీని సమానం చేశారు. కాగా, మొదటి రౌండ్ నుంచి మొదలుపెట్టి, ఫైనల్ వరకూ ప్రతి దశలోనూ ఎంతో కొంత మొత్తం లభిస్తుంది. మొదటి రౌండ్‌లో ఓడిన వారు కూడా 34,500 డాలర్లు తమ వెంట తీసుకెళతారు. మెయిన్‌డ్రాకు అర్హత సంపాదిస్తే చాలు.. ఆతర్వాత ప్రతి రౌండ్‌లోనూ కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మాత్రమే చూడగలిగే అంశం. 2000 సంవత్సరంలో ప్రైజ్‌మనీ 20 మిలియన్ డాలర్లుకాగా, క్రమంగా పెరుగుతూ ఇప్పుడు 40 మిలియన్ డాలర్లకు చేరింది. గ్రాండ్ శ్లామ్స్‌లోనే తలమానికమైన వింబుల్డన్‌లోనూ ఇంత భారీ ప్రైజ్‌మనీ లేకపోవడం గమనార్హం.