క్రీడాభూమి

ఎండలతో తంటా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్: ఎప్పటి మాదిరిగానే నిప్పులు చెరిగిన ఎండ ప్రతి ఒక్కరినీ అల్లాడించనున్నాయ. దీని ప్రభావం ఆస్ట్రేలియా ఓపెన్‌లోనూ కనిపించడం ఖాయం. ఈ టోర్నీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. ప్రేక్షకులు కూడా మ్యాచ్‌లను చూసేందుకు పొటెత్తుతారు. అయతే, మండుతున్న ఎండలు ప్రతిసారీ ఆస్ట్రేలియా ఓపెన్‌ను వెంటాడుతునే ఉన్నాయ. టోర్నమెంట్ జరిగే సమయంలో ఎండలు మండిపోవడంతో చాలా మంది క్రీడాకారులు బెంబేలెత్తిపోతారు. టోర్నీకి వేదికైన మెల్బోర్న్‌లో వేడిని భరించడం సామాన్యమైన విషయం కాదు. ఇక అమెరికా, బ్రిటన్, స్విట్జర్లాండ్, స్పెయిన్ వంటి శీతల దేశాల నుంచి టోర్నీలో పాల్గొనేవారి పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. నిరుడు మెల్బోర్న్‌లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదైంది. ఈసారి అంతకంటే ఎక్కువ ఉషోణ్రగతతో మెల్బోర్న్ అగ్ని గుండంలా మారింది. 1905లో టోర్నమెంట్ మొదలైంది. తొలి ఏడాది పోటీలకు ఎంత వల్ల ఎలాంటి ప్రమాదం లేకపోయనా, మరుసటి సంవత్సరంలోనే ఉక్కబోత సమస్య అటు పోటీదారులకు, ఇటు ప్రేక్షకులకు తెలిసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించడం అసాధ్యం కాబట్టి, ఆటగాళ్లు ఎండ బారిన పడకుండా ప్రతిసారీ నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. కానీ అవి సత్ఫలితాలనిస్తున్న దాఖలాలు లేవు. అగ్ని గుండాన్ని తలపించే మెల్బోర్న్‌లో మ్యాచ్‌లు ఆడడం సాధ్యంగా లేదని చాలా మంది వాపోతున్నారు. ఏ క్రీడలోనైనా చెమటోడ్చడం అంటే కష్టపడడం. ఆస్ట్రేలియా ఓపెన్‌లో మాత్రం ఈ మాటకు మెల్బోర్న్ ఉక్కబోతను భరించడమనే అర్థం వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు నిర్వాహకులు గడ ఏడాది హీట్ పాలసీని అమలు చేశారు. గతంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరే వరకూ వేచిచూసేవారు. ఉషోణ్రగత ఆ స్థాయకి చేరుకునే సమయంలో కొనసాగుతున్న సెట్ పూర్తయ్యే వరకూ వేచి ఉండేవారు. సెట్‌ను ముగిసిన తర్వాతే స్టేడియం పైకప్పును మూసేసి ఆటను కొనసాగించేవారు. కానీ, రెండేళ్ల క్రితం కొత్త హీట్ పాలసీని అమలు చేశారు. దాని ప్రకారం ప్రకారం ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరిన మరుక్షణమే ఆటను నిలిపేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, క్షణాల్లో మూసుకునే పైకప్పును ఏర్పాటు చేశారు. పరిస్థితి తీవ్రత పెరిగితే, అత్యవసర సమయాల్లో ఉపయోగించే విధంగా 363 మిలియన్ డాలర్ల ఖర్చుతో మరో స్టేడియం రూఫ్‌ను ఆధునీకరించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ పైకప్పు కేవలం ఐదు నిమిషాల్లో మూసుకుపోతుంది. మండే ఎండల నుంచి ఆటగాళ్లను, ప్రేక్షకులను రక్షించేందుకు ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహకులు తీవ్రంగానే కృషి చేస్తున్నారు. వారి ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, మండే ఎండలతో మల్బోర్న్‌లో ప్రతి ఒక్కరికీ ఇబ్బందులు తప్పవు.