క్రీడాభూమి

పుంజుకోవడానికి తుది అవకాశం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, జనవరి 14: ఇటీవల కాలంలో విఫలవుతున్న బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే క్రికెట్ జట్లకు మళ్లీ పుంజుకొనే అవకాశం లభించనుంది. సోమవారం నుంచి ఇక్కడ ప్రారంభమయ్యే ముక్కోణపు వనే్డ టోర్నమెంట్‌లో ఈ మూడు జట్లు పోరాడనున్నాయి. వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్‌కు తగిన విధంగా సమాయత్తమయ్యేందుకు ఈ టోర్నీని తొలి అడుగుగా క్రీడా పండితులు పేర్కొంటున్నారు. మష్రాఫ్ మొర్తాజా నాయకత్వం వహిస్తున్న బంగ్లాదేశ్ జట్టులో షకీబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్, మహమ్మదుల్లా వంటి మేటి క్రికెటర్లు ఉన్నారు. కాగా, తిసర పెరెరా స్థానంలో మళ్లీ లంక జట్టుకు నాయకత్వం పగ్గాలు చేపట్టిన ఏంజెలో మాథ్యూస్‌కు ఇది తొలి పరీక్ష. దినేష్ చండీమల్, కుశాల్ పెరెరాతోపాటు వైస్ కెప్టెన్ సురంగ లక్మల్ కూడా తమను తాము నిరూపించుకోవడానికి ఈ టోర్నీని సరైన వేదికగా భావిస్తున్నారు. ఇక నిలకడలేని జట్టుగా ముద్ర వేయించుకున్న జింబబ్వేకు గ్రేమ్ క్రెమెర్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఒకరిద్దరు తప్ప జట్టులో సీనియర్లు ఎక్కువ మంది లేరు. అయితే, యువ క్రికెటర్లు సర్వశక్తులు ఒడ్డితే, సీనియర్ల కంటే వారే గొప్పగా రాణించినా ఆశ్చర్యం లేదు.