క్రీడాభూమి

కోహ్లీ పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, జనవరి 14: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మురళీ విజయ్‌ని మినహాయిస్తే, టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విఫలంకాగా, భారత జట్టును ఆదుకునే బాధ్యతలను తన భుజాలపై వేసుకున్న కెప్టెన్ కోహ్లీ పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 335 పరుగులకు ఆలౌట్‌కాగా, రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. ప్రత్యర్థి కంటే ఇంకా 152 పరుగులు వెనుకంజలో నిలిచిన టీమిండియా చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి. ఆరు వికెట్లకు 269 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఉదయం ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా 282 పరుగుల వద్ద కేశవ్ మహారాజ్‌ను కోల్పోయింది. 18 పరుగులు చేసిన అతను మహమ్మద్ షమీ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ పార్థీవ్ పటేల్‌కు చిక్కాడు. కాగిసో రబదా 11 పరుగులు చేసి, ఇశాంత్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడుతున్న కెప్టెన్ పఫ్ డు ప్లెసిస్ 63 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద ఇశాంత్ శర్మ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 142 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో తొమ్మిది ఫోర్లు ఉన్నాయి. మోర్న్ మోర్కెల్ ఆరు పరుగులు చేసి, అశ్విన్ బౌలింగ్‌లో మురళీ విజయ్ చక్కటి క్యాచ్ పట్టగా ఔట్ కావడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. అశ్విన్ 113 పరుగులిచ్చి నాలుగు వికెట్లు సాధించాడు. ఇశాంత్ శర్మ 46 పరుగులకు మూడు వికెట్లు తీశాడు.
రాహుల్ విఫలం
భారత్ ఇన్నింగ్స్ మొదలైన తర్వాత, క్రీజ్‌లో నిలబడాల్సిన బాధ్యత ఉన్న ఓపెనర్ లోకేష్ రాహుల్ తన ప్రయత్నంలో విఫలమయ్యాడు. 10 పరుగులు చేసిన అతను మోర్న్ మోర్కెల్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్‌కాగా, భారత్ తొలి వికెట్ 28 పరుగుల వద్ద కూలింది. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన చటేశ్వర్ పుజారా కేవలం ఒక బంతిని ఎదుర్కొని, ఒక్క పరుగు కూడా చేయకుండానే రనౌటయ్యాడు. సెకండ్‌లో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ జాగ్రత్తగా ఆడుతూ, ఓపెనర్ విజయ్‌తో కలిసి జట్టు స్కోరును వంద పరుగుల మైలురాయిని దాటించాడు. అయితే, విజయ్ 125 బంతులు ఎదుర్కొని 46 పరుగులు చేసి, కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో బంతిని సరిగ్గా అర్థం చేసుకోలేక, వికెట్‌కీపర్ క్వింటన్ డి కాక్‌కు దొరికాడు. రోహిత్ శర్మ 10, పార్థీవ్ పటేల్ 19 పరుగులు చేసి పెవిలియన్ చేరగా, రెండో రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీ 85, హార్దిక్ పాండ్య 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
స్కోరుబోర్డు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 6 వికెట్లకు 265): డీన్ ఎల్గార్ సి మురళీ విజయ్ బి అశ్విన్ 31, ఎయిడెన్ మర్‌క్రామ్ సి పార్థీవ్ పటేల్ బి అశ్విన్ 94, హషీం ఆమ్లా రనౌట్ 82, ఏబీ డివిలియర్స్ బి ఇశాంత్ శర్మ 20, ఫఫ్ డు ప్లెసిస్ బి ఇశాంత్ శర్మ 63, క్వింటన్ డికాక్ సి విరాట్ కోహ్లీ బి అశ్విన్ 0, వెర్నన్ ఫిలాండర్ రనౌట్ 0, కేశవ్ మహారాజ్ సి పార్థీవ్ పటేల్ బి మహమ్మద్ షమీ 18, కాగిసో రబదా సి హార్దిక్ పాండ్య బి ఇశాంత్ శర్మ 11, మోర్న్ మోర్కెల్ సి మురళీ విజయ్ బి అశ్విన్ 6, లూన్గీ నిడీ 1 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 9, మొత్తం (130.5 ఓవర్లలో ఆలౌట్) 335.
వికెట్ల పతనం: 1-85, 2-148, 3-199, 4-246, 5-250, 6-251, 7-282, 8-324, 9-333, 10-335.
బౌలింగ్: జస్‌ప్రీత్ బుమ్రా 22-6-60-0, మహమ్మద్ షమీ 15-2-58-1, ఇశాంత్ శర్మ 22-4-46-3, హార్దిక్ పాండ్య 16-4-50-0, అశ్విన్ 38.5-10-113-4.
భారత్ తొలి ఇన్నింగ్స్: మురళీ విజయ్ సి క్వింటన్ డి కాక్ బి కేశవ్ మహారాజ్ 46, లోకేష్ రాహుల్ సి అండ్ బి మోర్న్ మోర్కెల్ 10, చటేశ్వర్ పుజారా రనౌట్ 0, విరాట్ కోహ్లీ 85 నాటౌట్, రోహిత్ శర్మ ఎల్‌బీ కాగిసో రబదా 10, పార్థీవ్ పటేల్ సి క్వింటన్ డి కాక్ బి లూన్గీ నిడీ 19, హార్దిక్ పాండ్య 11 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 2, మొత్తం (61 ఓవర్లలో 5 వికెట్లకు) 183.
వికెట్ల పతనం: 1-25, 2-28, 3-107, 4-132, 5-164.
బౌలింగ్: కేశవ్ మహారాజ్ 16-1-53-1, మోర్న్ మోర్కెల్ 15-3-47-1, వెర్నన్ ఫిలాండర్ 9-3-23-0, కాగిసో రబదా 12-0-33-1, లూన్గీ నిడీ 9-2-26-1.