క్రీడాభూమి

టెన్నిస్ విందుకు మెల్బోర్న్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్: ఈ ఏడాది మొదటి గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ విందుకు మెల్బోర్న్ సిద్ధమైంది. ఆదివారం నుంచి మొదలై, ఈనెల 28వ తేదీతో ముగిసే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ కోసం అటు టెన్నిస్ స్టార్లు, ఇటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టెన్నిస్ టోర్నమెంట్స్‌కు సహజంగానే విశేష ఆదరణ ఉంటుంది. ఇక గ్రాండ్ శ్లామ్ టోర్నీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యాలండర్ ఇయర్‌లో వచ్చే నాలుగు గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో మొదట వచ్చేది ఆస్ట్రేలియా ఓపెన్. దీని తర్వాత ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, చివరిగా యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టోర్నీలు జరుగుతాయ. ఇలావుంటే, ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా గ్రాండ్ శ్లామ్ యుద్ధానికి శంఖారావం పూరించే ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఏటేటా పోటీ పెరుగుతున్నది. ప్రపంచ మేటి స్టార్ల మధ్య సాగే భీకర సంగ్రామానికి మెల్బోర్న్ అన్ని విధాలా ముస్తాబైంది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెదరర్ టైటిల్‌ను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, ప్రపంచ మాజీ నంబర్ వన్ ఆండీ ముర్రే గాయానికి శ్రస్తచికిత్స చేయంచుకొని, ప్రస్తుతం పునరావాస శిక్షణ పొందుతున్నాడు. ముర్రే లేకపోయనప్పటికీ, ప్రపంచ నంబర్ వన్ రాఫెల్ నాదల్, మాజీ టాపర్ నొవాక్ జొకోవిచ్ తదితరుల నుంచి ఫెదరర్‌కు గట్టిపోటీ తప్పకపోవచ్చు. కాగా, మహిళల సింగిల్స్‌లో నిరుటి విజేత సెరెనా విలియమ్స్ వ్యక్తిగత కారణాలతో ఈ టోర్నీకి హాజరుకావడం లేదు. ఆమె బరిలోకి లేకపోవడంతో, ఈసారి మహిళల సింగిల్స్‌లో ఎవరు గొప్పగా ఆడతారన్నది అంచనాలకు కూడా అందడం లేదు. ఇలావుంటే, చారిత్రక నేపథ్యం ఉంది కాబట్టే ఆస్ట్రేలియా ఓపెన్‌కు గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో విశేష స్థానం ఉంది. ఇందులో వివిధ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తారు. పురుషులు, మహిళల సింగిల్స్, డబుల్స్‌తోపాటు మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ పోరు సాగుతుంది. జూనియర్, వెటరన్స్, వీల్‌చైర్ తదితర విభాగాల్లోనూ ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా ఓపెన్ వేదికవుతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌తోపాటు, క్వాలిఫయర్స్‌ను కూడా పరిగణలోకి తీసుకొని మెయన్ డ్రాకు అర్హులైన వారి పేర్లను ప్రకటిస్తారు. పురుషుల సింగిల్స్ విభాగంలో మొత్తం 128 మంది బరిలోకి దిగుతారు. వీరిలో 104 మంది తమతమ ర్యాంకింగ్స్ ప్రాతిపదిక మీద డైరెక్ట్ ఎంట్రీ సంపాదిస్తే, 16 మంది క్వాలిఫయర్స్ ద్వారా స్థానాన్ని దక్కించుకుంటారు. వారివారి ట్రాక్ రికార్డును, ఫాన్ ఫాలోయంగ్‌ను దృష్టిలో ఉంచుకొని మరో ఎనిమిది మందికి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇస్తారు. మహిళల సింగిల్స్‌లోనూ 128 మంది పోటీపడతారు. అయితే, పురుషుల విభాగానికి భిన్నంగా ఇందులో 108 మంది డైరెక్ట్ ఎంట్రీ సంపాదిస్తారు. 12 మంది క్వాలిఫయర్స్ నుంచి, ఎనిమిది మంది వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా మెయిన్ డ్రాకు అర్హత పొందుతారు. కాగా, పురుషులు, మహిళల డబుల్స్‌లో చెరి 64 జోడీలు పోటీలో ఉంటాయి. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో 32 జోడీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. ఈ మూడు విభాగాల్లో ఏడేసి జట్లు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా రంగ ప్రవేశం చేస్తాయి. ఏడాది ఆరంభంలో జరిగే గ్రాండ్ శ్లామ్ కాబట్టి, సహజంగానే మేటి స్టార్లంతా ఈ టోర్నీతోనే శుభారంభం చేయాలని అనుకుంటారు. అందుకే, మిగతా గ్రాండ్ శ్లామ్స్‌కు భిన్నంగా ఆస్ట్రేలియా ఓపెన్‌లో క్వాలిఫయంగ్ పోటీలు కూడా పోటాపోటీగా సాగుతాయ. క్యాలండర్ ఇయర్ మొదటి గ్రాండ్ శ్లామ్ కావడంతో, ఇందులో ఫలితాల ప్రభావం మిగతా టోర్నీలపైనా కూడా ఉంటుంది. అందుకే, ఆస్ట్రేలియా ఓపెన్‌కు స్టార్లు క్యూ కడతారు. ఫిట్నెస్ సమస్యలు లేకపోతే, ఈ టోర్నమెంట్‌కు దూరమయ్యేందుకు ఎవరూ సిద్ధపడరు.
*
ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మక్కువ ఉంది. ఈ టోర్నీలో మ్యాచ్‌లను తిలకించడానికి ప్రేక్షకులు పోటెత్తుతారు. 2004 సంవత్సరంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ మ్యాచ్‌లను 5,21,691 మంది చూసినట్టు అధికార గణాంకాలు చెప్తున్నాయ. గత ఏడాది ఈ సంఖ్య 7,03,899కి చేరింది. అంతకు ముందు రెండేళ్లతో పోలిస్తే, గత ఏడాది హాజరైన ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. 2012లో 6,86,006 మంది, 2013లో 6,84,467, 2014లో 5,74,388 మంది మ్యాచ్‌లను చూశారు. అంతకు ముందు మూడేళ్లుగా సంఖ్య తగ్గినా గత ఏడాది మళ్లీ పెరిగింది.