క్రీడాభూమి

రెండో రౌండ్‌లోకి షరపోవా, కెర్బర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, జనవరి 16: ప్రపంచ మాజీ చాంపియన్లు మరియా షరపోవా, ఏంజిలీక్యూ కెర్బర్ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. అయితే, మెల్‌బోర్న్‌లో వాతావరణం చాలా వేడిగా ఉండడంతో వారు రెండో రౌండ్‌లోకి వెళ్లడానికి చాలా సమయం వెచ్చించాల్సి వచ్చింది. 15 నెలల నిషేధం తర్వాత మళ్లీ రంగంలోకి దిగిన ఐదుసార్లు ప్రధాన టోర్నీల్లో విజయం సాధించిన షరపోవా మళ్లీ యధాప్రకారంగా తన సత్తా చూపేందుకు సిద్ధమైంది.
2008లో మెల్‌బోర్న్‌లో జరిగిన పోటీలో చాంపియన్‌గా అవతరించిన ఈమె ప్రస్తుతం 48వ ర్యాంకుతో ఉంది. మరో క్రీడాకారిణి, 2016లో టైటిల్ సాధించిన ప్రపంచ మాజీ నెంబర్ వన్ అయిన ఏంజిలీక్యూ కెర్బర్ మాట్లాడుతూ గతంలో జరిగిన కొన్ని పొరపాట్లకు తాను చింతించడంలేదని, ప్రస్తుతం జరుగుతున్న పోటీపైనే తన ఆటను దృష్టి సారించానని పేర్కొంది. ఇదిలావుండగా, ఆరో సీడ్ కరొలినా లిస్కోవా, ఎనిమిదో సీడ్ కరోలినా స్లోయెనా స్టీఫెన్స్, కోకో వాండెవెగ్ ఆదివారం జరిగిన పోటీలో తలపడ్డారు.