క్రీడాభూమి

బ్రాడ్‌మన్ రికార్డును సమం చేసిన కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, జనవరి 16: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్‌మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్‌లో సోమవారం జరిగిన పోటీలో కోహ్లీ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్‌మన్ రికార్డుతో సమానంగా టెస్ట్‌మ్యాచ్‌లలో 150 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 152 పరుగులు చేసి అజేయంగా నిలబడడమే కాకుండా 150కి పైగా పరుగులు సాధించడం కోహ్లీకి ఇది ఎనిమిదవసారి. ఇవన్నీ కూడా 56 టెస్టుల్లోనే సాధించడం విశేషం. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్స్ ఏడుసార్లు 150 పరుగులు చేయడం ద్వారా మూడో స్థానంలో నిలిచాడు. మూడోరోజు ఆటలో 182/5 ఓవర్‌నైట్ స్కోరుతో భారత్ బ్యాటింగ్ ఆరంభించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ తన విరాట రూపం ప్రదర్శించి కెపెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ తనదైన శైలిలో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ అర్ధవంతమైన, అందమైన, చురుకైన షాట్లతో అలరించాడు. కోహీ తన కెరీర్‌లో 21వ శతకం బాదాడు.