క్రీడాభూమి

ఛేదనలో తడబడిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, జనవరి 16: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు జరిగిన రెండవ ఇన్నింగ్స్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్లు బ్యాటింగ్ ఝళిపించడంలో తడబడ్డారు. 287 పరుగుల లక్ష్యఛేదనలో బ్యాటింగ్ ప్రారంభించినప్పటినుంచే తడబడ్డారు. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఓపెనర్ మురళీ విజయ్ 8వ ఓవర్‌లో 9 పరుగులకే ఔటయ్యాడు.
ఇతను తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఆడినా, రెండో ఇన్నింగ్స్‌లో పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. కేఎల్ రాహుల్ 29 బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగాడు. దక్షిణాఫ్రికా జట్టులో టెస్టు క్రికెట్‌లో తొలిసారిగా ఆరంగేట్రం చేసిన యువ క్రికెటర్ లుంగీ ఎంగిడి రాహుల్‌ను ఔట్ చేశాడు.
ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 20 బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి ప్రేక్షకులను నిరాశపరిచాడు. రెండో ఇన్నింగ్స్ మూడవ రోజున చెలరేగి విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించిన కోహ్లీ మళ్లీ నాలుగో రోజు కూడా అదేవిధంగా ఆటతీరును కనబరుస్తాడనుకుంటే ఉసూరుమనిపించాడు. ఈ ముగ్గురూ 26 పరుగులలోపే పెవిలియన్ దారి పట్టడం ప్రేక్షకులను నిరాశపరిచింది. లుంగీ ఎంగిడి విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లను ఔట్ చేయగా, మురళీ విజయ్ వికెట్‌ను కగిసో రబడ దక్కించుకున్నాడు. ప్రస్తుతం చటేశ్వర్ పుజారా, పార్థివ్ పటేల్ క్రీజులో ఉన్నారు.
భారత్ ముంగిట భారీ లక్ష్యం
భారత్‌తో జరుగుతున్న టెస్టుమ్యాచ్ నాలుగోరోజున దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ సారథ్యంలో ఆ జట్టు బ్యాట్స్‌మెన్లు మొత్తం 258 పరుగులు చేశారు. ఒక్క డుప్లెసిస్‌నే ఏకంగా మూడుగంటలపాటు ఆడి 122 బంతులను ఎదుర్కొన్నాడు. డుప్లెసిస్, వెర్నన్ ఫిలాండర్‌తో కలసి ఆరో వికెట్‌కు 26వ ఓవర్‌సరికల్లా 46 పరుగులు జత చేశారు. మహ్మద్ షమీ లంచ్ విరామ సమయానికి ముందు వేసిన నాలుగు ఓవర్లలో 42 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకోవడంతో దక్షిణాఫ్రికా జట్టు ఆచితూచి ఆడడం మొదలెట్టింది.
ఓవర్‌నైట్ స్కోరుతో ఆడిన దక్షిణాఫ్రికా 91.3 ఓవర్లలో 258 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆతిధ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 28 పరుగులు ఎక్కువ చేసింది. దీంతో ఈ లక్ష్య ఛేదనకు భారత్ 287 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందురోజు సోమవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు బ్యాట్స్‌మెన్ డివిలియర్స్ 121 బంతుల్లో 10 ఫోర్లతో చెలరేగి 80 పరుగులు సాధించాడు. తన పదునైన ఆటతీరుతో భారత బౌలర్లను వణికించినా శతకం చేజార్చుకున్నాడు. డివిలియర్స్‌తోపాటు దిగిన ఓపెనర్ డీన్ ఎల్గర్ 121 బంతులు ఎదుర్కొని ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్‌తో 60 పరుగులు చేసి వెనుతిరిగాడు. అతని తర్వాత వచ్చిన డికాక్ కేవలం 12 పరుగులు చేసి అవుటయ్యాడు. డివిలియర్స్, డీన్ ఎల్గర్, డికాక్‌లను భారత ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ షమీ ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ 141 బంతులు ఎదుర్కొని కేవలం 48 పరుగులు చేయగలిగాడు.
ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లెవరూ ఎక్కువ పరుగులేమీ చేయకుండానే వెనుతిరిగారు. భారత్‌లో షమీ మొత్తం నాలుగు వికెట్లు, బుమ్రా రెండు వికెట్లు, ఇశాంత్ శర్మ రెండు వికెట్లు, రవీంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీశారు. సెంచూరియన్ మైదానంలో గతంలో జరిగిన చాలా మ్యాచుల్లోని నాలుగో ఇన్నింగ్స్‌లో ఒక జట్టు ఆడిన అత్యధిక స్కోరు 226. అయితే, దక్షిణాఫ్రికా జట్టు 258 పరుగులు చేయడం ఒక విశేషమైతే, భారత్ జట్టు ముందు భారీ లక్ష్యం ఉంచింది.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 335 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 258 పరుగులు చేసింది.
స్కోర్‌బోర్డు (నాలుగో రోజు):
భారత్‌తో జరిగిన రెండవ టెస్టుమ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 335 పరుగులు చేయగా, భారత్ 307 పరుగులు చేసింది. రెండవ ఇన్నింగ్స్‌లో 91.3 ఓవర్లలో దక్షిణాఫ్రికా 258 పరుగులకు ఆలౌట్ అయింది.
సంక్షిప్తంగా: ఎయిడెన్ మోర్కమ్ ఎల్‌బిడబ్ల్యు బి బుమ్రా 1, డీన్ ఎల్గర్ సి రాహుల్ బి షమీ 61, హష్మి ఆమ్లా ఎల్‌బిడబ్ల్యు బి బుమ్రా 1, ఏబీ డివిలియర్స్ సి పటేల్ బి షమీ 80, ఫఫ్ డుప్లెసిస్ సి అండ్ బి బుమ్రా 48, క్వింటన్ డి కాక్ సి పటేల్ బి షమీ 12, వెర్నర్ ఫిలాండర్ సి విజయ్ బి ఇషాంత్ 26, కేశవ్ మహారాజ్ సి పటేల్ బి ఇషాంత్ 6, కగిసో రబడ సి కొహ్లి బి షమీ 4, మోర్నె మోర్కల్ నాటౌట్ 10, లుంగి ఎంగిడి సి విజయ్ బి అశ్విన్ 1.
ఎక్స్‌ట్రాలు: (బి-2 ఎల్‌బి-5 వికెట్-1) మొత్తం 8 (91.3 ఓవర్లలో ఆలౌట్) 258 పరుగులు.
వికెట్ల పతనం: 1/1/ 2/3 3/144 4/151 5/163 6/209 7/215 8/245 9/245.
బౌలింగ్: రవీంద్ర అశ్విన్ 29.3-6-78-1, జస్పీత్ బుమ్రా 20-3-7--3, ఇషాంత్ శర్మ 17-3-40-2, మహ్మద్ షమీ 16-3-49-4, హార్ధిక్ పాండ్యా 0-1-14-0