క్రీడాభూమి

సన్నద్ధత లేకే దారుణ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 17: దక్షిణాఫ్రికాపై భారత క్రికెట్ జట్టు ఓటమి తనను ఏ మాత్రం ఆశ్చర్యానికి గురి చేయలేదని మాజీ కెప్టెన్ బిషన్‌సింగ్ బేడీ వ్యాఖ్యానించాడు. శ్రీలంక వంటి చిన్న జట్టుపై గెలిచేందుకు కాలాన్ని వృథా చేయడమే గాక, దక్షిణాఫ్రికాతో తలపడేందుకు కోహ్లీ సేన ఏ విధంగానూ సన్నద్ధం కాలేకపోయిందని అన్నాడు. సెంచూరియన్‌లో బుధవారం నాడు 135 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై దారుణ వైఫల్యం చెందిన భారత జట్టు 2-0 తేడాతో సిరీస్‌ను చేజార్చుకుందని బేడీ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే ముందు శ్రీలంకతో మ్యాచ్‌లు ఆడి కాలాన్ని వృథాచేసినందునే భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని ఆయన విశే్లషించాడు. ‘మనవాళ్లకు ఎలాంటి సన్నద్ధత లేదు.. శ్రీలంక జట్టుతో ఆడి కాలహరణం చేశారు.. దక్షిణాఫ్రికా జట్టుతో తలపడడానికి ముందు- అత్యంత బలహీనమైన శ్రీలంక జట్టుతో నెలన్నర రోజులపాటు మ్యాచ్‌లు ఆడడం సరికాదు..’ అని బేడీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘శ్రీలంక వెళ్లి అక్కడి జట్టుపై మనం గెలవవచ్చు.. వారిని భారత్‌కు ఆహ్వానించవచ్చు.. అయితే, దక్షిణాఫ్రికా వంటి పెద్ద టీమ్‌లతో ఆడాలంటే తగినవిధంగా సన్నద్ధం కావాల్సిందే.. దక్షాణాఫ్రికాపై భారత్ ఓటమి గురించి గోరంతలు కొండంతలు చేయనక్కర్లేదు.. అయినా మనం వాస్తవాలను గుర్తించాలి.. మన బౌలర్లు బాగా రాణించారు.. బ్యాటింగ్ మాత్రం నిరాశ పరచింది.. భారత టీమ్‌ను తీర్చిదిద్దాల్సిన తరుణం ఇదే..’ అని ఆయన చెప్పాడు.
ఈ ఏడాది చివర్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల్లో భారత్ జట్టు పర్యటించాల్సి ఉందని, దక్షిణాఫ్రికాలో వలే కాకుండా ‘అభిమానులను పెంచుకునేలా’ మన జట్టు ఆడాలని బేడీ ఆకాంక్షించాడు. అయిదు రోజుల మ్యాచ్‌ల కన్నా వన్‌డే మ్యాచ్‌లకు ఆటగాళ్ల ఎంపికపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించాడు. దక్షిణాఫ్రికాపై జరిగిన మొదటి రెండు టెస్టులకు వైస్ కెప్టెన్ రెహానే బదులు రోహిత్ శర్మను ఎంపిక చేయడాన్ని ఆయన తప్పుపట్టాడు. వైస్ కెప్టెన్ ఆడకపోవడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని బేడీ తెలిపాడు. రెహానేను ఆడించకపోతే అతనిని వైస్ కెప్టెన్‌గా ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నించాడు. టెస్టు మ్యాచ్‌లకు ఆటగాళ్ల ఎంపిక సరిగా లేనందునే దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను కోల్పోవలసి వచ్చిందన్నాడు. ఫస్ట్ టెస్ట్‌లో రాణించిన పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను ఆ తర్వాత తప్పించడం కూడా సరికాదన్నాడు.