క్రీడాభూమి

బ్యాట్స్‌మనే్ల ముంచారు: కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, జనవరి 17: సఫారీ గడ్డపై ఓటమికి బ్యాట్స్‌మెన్‌ల వైఫల్యమే కారణమని టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. బౌలర్లు రాణించినా ఫలితం దక్కలేదని అతడు పేర్కొన్నాడు. అన్ని విభాగాల్లోనూ పట్టుసాధించి దక్షిణాఫ్రికా జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుందని విరాట్ చెప్పాడు. బుధవారం నాటి రెండోటెస్ట్‌లో 135 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో కోహ్లీ టీమ్ ఓటమి పాలైంది. సిరీస్‌ను 2-0తో సఫారీ జట్టు గెలుచుకుందన్నాడు.‘దక్షిణాఫ్రికాకు గట్టిపోటీ ఇవ్వలేకపోయాం. ఎలాగైనా గెలవాలని అనుకున్నాం. అయితే వరుస వైఫల్యాలతో ఓటమి తప్పలేదు’అని మ్యాచ్ అనంతరం కోహ్లీ వెల్లడించాడు. ఫీల్డింగ్ విభాగంలోనూ భారత్ పేలవమైన ప్రదర్శన చూపించింది. బంగారంలాటి క్యాచ్‌లు జారవిడిచారు. అన్నింటికన్నా పేలవమైన బ్యాటింగ్‌తో పరాజయం తప్పలేదని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
అన్ని విభాగాల్లోనూ పైచేయిగా నిలిచిన దక్షిణాఫ్రికానే విజయం వరించిందని విరాట్ అన్నాడు. సమష్టిగా రాణించిన సఫారీలు సిరీస్‌ను దక్కించుకున్నారని తెలిపాడు. ఈ టెస్ట్ ఎంతో కష్టమైందని భావించినా జట్టుమొత్తం సమన్వయంతో ఆడడంతో విజయం దక్కిందని దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెస్సిస్ అన్నాడు. సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు గత ఐదు రోజులూ ఎంతో సాధన చేశామని అతడు స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా గెలుపులో కీలక పాత్ర పోషించిన ఫాస్ట్ బౌలర్ లుంగీ ఎంగిడిపై అతడు ప్రశంసలు కురిపించాడు. 39 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసి భారత్‌ను కోలుకోలేని దెబ్బతీశాడని కెప్టెన్ పేర్కొన్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో చెలరేగి ఆడిన ఎంగిడికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.