క్రీడాభూమి

రెండో ఇన్నింగ్స్‌లోనూ అదేతీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చటేశ్వర్ పుజారా తన తొలి ఇన్నింగ్స్‌లో చేసిన తప్పిదమే మళ్లీ రెండో ఇన్నింగ్స్‌లోనూ చేశాడు. పుజారా 47 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో కేవలం 19 పరుగులు మాత్రమే చేసి జట్టును మళ్లీ నిరాశపరిచాడు. ఆట ప్రారంభమైన 19వ బంతికే రన్ అవుటై రెండు ఇన్నింగ్స్‌లోనూ రెండుసార్లు రన్‌ఔటైన భారత ఆటగాడిగా చెత్తరికార్డును మూటకట్టుకున్నాడు. పుజారా మాదిరిగానే రెండు ఇన్నింగ్స్‌లలో రనౌటైన వారి జాబితాలో మరికొందరు క్రికెటర్లు కూడా ఉన్నారు. వెల్లింగ్టన్‌లో జింజాబ్వేతో 2000 సంవత్సరంలో జరిగిన రెండు ఇన్నింగ్స్‌లలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా రనౌటైన చరిత్ర ఉంది. అదేవిధంగా ఆస్ట్రేలియా స్కిప్పర్ మార్క్ టేలర్, ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హీలే కూడా రెండు ఇన్నింగ్స్‌లలో రనౌటైనవారి జాబితాలో ఉన్నారు.